స్త్రీ పురుషులు ఒకరి తొడతో మరొకరి
తొడను చుట్టేసి, చేతులతో పెనవేసుకుని శయనించే భంగిమను తిల తండులకం అని
అంటారు. మోహ పరవశులై విపరీతమైన అనురాగంతో బలంగా కౌగిలించుకోవడాన్ని క్షీర
జలకం అని అంటారు. కూర్చున్న లేదా పరుండిన భంగిమలలో ఏ స్థితిలోనైనా ఈ
కౌగిలింతలో సుఖం అనుభవించవచ్చునని వాత్స్యాయనుడు అంటారు. ఈ భంగిమలో స్త్రీ
పురుషులు పాలు, నీరు కలిసినట్టు కలిసిపోతారు. అందుకే దీనిని క్షీర జలకం అని
అంటారు.
క్షీర జలకం భంగిమలోనే పురుషుడు తన
తొడలతో స్త్రీ ఒక తొడను కాని, రెండు తొడలను కాని చుట్టివేసి స్త్రీ తొడలను
బలంగా ఒత్తితే దానిని ఊరూప గుహనం అని అంటారు.
పురుషుడు కూర్చున్నా,నిలుచున్నా
లేదా శయనించి ఉన్న సమయాలలో స్త్రీ పురుషుని వక్ష స్థలంపై తన వక్షోజాల భారం
మోపి అతనిలో కామోద్రేకం రేపుతూ చేతులతో మాత్రం కౌగిలించుకోని స్థితిని
స్థనాలింగనం అని అంటారు.
అంటే స్త్రీ తన స్థనాలతో పురుషుని
కౌగిలించుకోవడం అన్న మాట. ఈ భంగిమ పురుషునిలో తీవ్రమైన మోహావేశాన్ని
కలిగిస్తుంది. ఎంతటి జడునిలోనైనా చలనాన్ని కలిగించి తీరుతుంది స్త్రీ
పురుషులు గాఢంగా కౌగిలించుకున్న స్థితిలో ఒకరి మొహంలో ఒకరు మొహం పెట్టి,
ఒకరి కన్నులలో మరొకరు చూసుకుంటూ, ఒకరి ఫాల భాగం మరొకరి ఫాల భాగం తాకుతూ
ఉండే స్థితిని లలాటికం అని అంటారు.
సాధారణంగా శృంగార క్రీడ ముగిసిన తర్వాత ఇటువంటి భంగిమలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.
ఇవే కాకుండా స్త్రీ పురుషుల
ఇష్టాయిష్టాలను బట్టి ఎన్నో రకాల ఆలింగనాలు జరగవచ్చు. ఏ కౌగిలింత అయినా
స్త్రీ పురుషులను శృంగార క్రీడకు దోహదం కలిగించేవిగా ఉండాలి.
ఏదేమైనా స్త్రీ శరీర తత్వాన్ని
గ్రహించి పురుషుడు రతి సాగించాలి. అప్పుడే ఇద్దరికీ సుఖం కలుగుతుంది.
సాధారణ స్త్రీ శరీర తత్వం మెల్లగా పారే సెలయేరు వంటిదని, పురుషుని తీరు
ఎగసి పడే సముద్రం వంటిదని వాత్స్యాయనుడు వివరిస్తాడు. స్త్రీలో వాంఛ
నెమ్మదిగా కలిగి రసోద్రేకం కలగడానికి కొంత సమయం పడుతుంది. పురుషుని స్థితి ఆ
విధంగా ఉండదు. స్త్రీ తత్వాన్ని పురుషుడు గ్రహించి, ఆమెకు అనుకూలంగా
మసలాలి.
స్త్రీలో స్పర్శ, కౌగిలింతలు,
చుంబనాలు ఆమెలోని కోర్కెను ద్విగుణీకృతం చేస్తాయి, అయితే పురుషునికి
సంభోగంతోనే తృప్తి కలిగి శృంగార క్రియ ముగిసినట్టవుతుంది. పురుషుని తీరును
బట్టి స్త్రీ సంభోగ క్రియలో ఒకేసారి కాకుండా ఎక్కువ సార్లు కూడా భావ
ప్రాప్త్రి పొందగలుగుతుంది.
పురుషుడు రతి ముగించినప్పుడు ఆమెలో
కామోద్రేకం తగ్గుముఖం పడుతుంది. ఇది గ్రహిస్తే స్త్రీని శృంగారంలో
ఎక్కువగా తృప్తి పరచవచ్చని వాత్స్యాయనుడు అంటారు. స్త్రీని బాహ్య
ప్రేరణలతోనే పరవశురాలిని చేయవచ్చు. బాహ్య ప్రేరణలోని కౌగిలింతల గురించి
తెలుసుకున్నారు కదా
No comments:
Post a Comment