ప్రస్త్రుతం స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? ఎటువంటి గురువునుంచీ కామ శాస్త్రాన్ని నేర్చుకోవాలి?
సృష్టిలోని 
జీవజాలం శృంగారశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకునో, అభ్యసించో అవి 
సంగమించడం లేదు కదా! మరి మానవుడు మాత్రం కామ శాస్త్రం గురించితెలుసుకోవలసిన
 అవసరం ఏమొచ్చింది? శాస్త్రం అభ్యసించనిదే సంభోగక్రియకు అనర్హులవుతారా? 
అంటే అటువంటిదేమీ ఉండదు. కాకపోతే దేనినైనా శాస్త్రంగా అభ్యసిస్తే మరింత 
ఉపయోగం ఉంటుంది. చివరికి ఇక్కడైనా అంతే. కామశాస్తాన్ని అభ్యసించిన వారు 
మిగిలిన వారికంటే ఎక్కువ సౌఖ్యాన్నిపొందగలరని వాత్స్యాయనుడు అంటాడు.
ఏ శాస్త్రాన్నైనా 
గురువు వద్ద నుంచే నేర్చుకుంటేనే రాణింపు ఎక్కువగా ఉంటుంది.కామశాస్త్రమైనా 
దీనికి మినహాయింపు కాదు. కామశాస్త్రాన్ని కూడా గురువు వద్ద నుంచీ 
నేర్చుకోవాలని వాత్స్యాయనుడు చెప్పాడు. పురుషుడు ఏ వయసులో, ఎప్పుడు ఈ 
శాస్త్రాన్ని అభ్యసించాలో ఇంతకుముందే కొద్దిగా వివరించాం. ప్రస్త్రుతం 
స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? ఎటువంటి గురువునుంచీ కామ 
శాస్త్రాన్ని నేర్చుకోవాలి? అన్న విషయాలు ఈ సంచికలో తెలుసుకుందాం
ఈనాటి కాలంలో 
కామశాస్త్రాన్ని అభ్యసించడాన్ని ఎవరూ హర్షించరు. నేర్చుకునేందుకు కూడా 
ముందుకురారు. కానీ పూర్వకాలంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. స్త్రీలు, 
పురుషులు కూడా కామశాస్త్రాన్ని అభ్యసించేవారు. స్త్రీలలో ఎక్కువమంది 
వేశ్యలే కామశాస్త్రాన్ని ఆ కాలంలో అభ్యసించేవారు. అందుకే వేశ్యలు విటుల్ని 
ఆకర్షించడానికి మెళుకువలను కూడా వివరించాడు. ఇదంతా గ్రహించి, 
వాత్స్యాయనుడికి వాస్తవ దృక్పథం లేదని పాఠకులుఅనుకోరాదు. ఆనాటి పరిస్థితులే
 ఎక్కువగా ప్రతిబింబించే అవకాశం ఉంది.
నిజానికి ఈ 
కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా యువతులకు కామ సూత్త్రాలునేర్పేందుకు 
ప్రత్యేకంగా గురువులుండే వారు కాదు. అందుకే వివాహం కావలసినయువతి, 
కామసూత్రాలను తెలుసుకొనగోరు యువతి వివాహానికి పూర్వం తనపుట్టింట్లోనే 
నేర్చుకోవాలని వాత్స్యాయనుడు సూచించాడు. అంటే నేటి పరిస్థితులలో ఇంచుమించు 
16-18 సంవత్సరాల వయసులో ఈ విద్యను అభ్యసించాలన్న మాట. కామసూత్రాలను 
నేర్చుకునే యువతులకు సన్నిహితంగా ఉండే సమ వయస్కులైన యువతులు ఆయా సూత్రాలు 
నేర్పాలంటాడు వాత్స్యాయనుడు. పెళ్లయిన యువతులు భర్త అంగీకారంతో 
కామశాస్త్రాన్ని అభ్యసించాలి. ప్రాచీన కాలంలో యువతులు 64 కళలలో ప్రవేశం 
కలిగి ఉంటే మంచిదనే అభిప్రాయం ఉంది. దీనితో వాత్స్యాయనుడు కూడా 
ఏకీభవిస్తాడు.వివాహానికి పూర్వం యువతి లలిత కళల్లో ప్రవేశం పొంది ఉండాలి.
ఇక యువకుడైతే 
బ్రహ్మచర్యం అవలంబిస్తూ ధనార్జన పరుడైన తర్వాత కామసూత్త్రాలను అభ్యసించడం 
మేలు. కామసూత్రాలతోపాటు సంగీతాది విద్యలలో ప్రవేశం ఉండడం 
మంచిది.వాత్స్యాయనుడు చెప్పిన సూత్రాలు ఆనాటి కాలాన్ని అనుసరించి 
చెప్పినవన్న సంగతి మర్చిపోరాదు. కొన్ని కొన్ని సూత్రాలు చూస్తున్నప్పుడు 
పాఠకులకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. అయితే అవి ప్రాచీన కాలాన్ని 
ఉద్దేశించి చెప్పినవని భావిస్తే వాత్స్యాయనుడు ఆలోచనలు సహేతుకంగా 
కనిపిస్తాయి.
శృంగారాన్నిప్రేరేపించడంలో పడక గది
 అలంకరించిన తీరు, పడక గదిలోని వాతావరణం కీలక పాత్ర వహిస్తాయని 
వాత్స్యాయనుడు చెబుతాడు. నేటి మానసిక శాస్త్రవేత్తలూ ఇదే విషయాన్ని 
సమర్ధించడం గమనించదగిన విషయం. పడక గది అలంకరించుకోవలసిన తీరు వాత్స్యాయనుడు
 ఏం చెప్పాడు, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పధం గురించి ఇప్పుడు చూద్దాం.
పడక గదిలో మేలైన, నగిషీలున్న మంచం 
ఉండాలి.దాని మీద మెత్తని తలగడలు, పరుపులు ఉంచాలి. తలగడలను తల వైపు, పాదాల 
వైపు కూడా అమర్చుకోవాలి. పరుపుపై శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని వేయాలి. 
ప్రతి రెండుమూడు రోజులకొకసారి ఈ వస్త్రాన్ని మార్చుతుండాలిఅని 
వాత్స్యాయనుడు చెబుతున్నాడు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని. పడకను 
సౌకర్యంగా అమర్చుకోవడం అవసరమని ఇక్కడ వాత్స్యాయనుడు పరోక్షంగా 
వివరిస్తున్నాడు.
''గదిలోకి అడుగిడిన వెంటనే అత్తరు,
 సుగంధద్రవ్యాల పరిమళాలు మత్తెక్కించాలి. లవంగాలు,యాలకుల వంటివి పడకగదిలో 
అందుబాటులో ఉంచుకోవాలి'' అని అంటారు వాత్స్యాయన ముని. అరోమా ధెరపీ అంటే ఈ 
కాలం వారికి బాగానే తెలుసు. సువాసనలతో మనసుకు ఆహ్లాదం కలిగించి కొన్ని రకాల
 వ్యాధులను నయం చేయవచ్చునని ఈ వైద్య శాస్త్రం చెబుతోంది. ఇక శృంగారానికి 
వచ్చే సరికి సువాసనలు, సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యాన్ని ప్రత్యేకించి 
చెప్పవలసిన అవసరం ఏమున్నది?
 
No comments:
Post a Comment