Welcome To సుఖ-సంసారం

Tuesday 1 July 2014

లైంగిక ఆరోగ్యం.... కావాలి మీ సొంతం

శృంగారం మానసిక నిశ్చలత్వాని ఇస్తుంది. అందుకే లైంగిక సమస్యలు ఉన్నవారు మానసికంగా ఏదో కోల్పోయిన భావనకు గురవుతూ ఉంటారు. ఎప్పుడో అరుదుగా తప్ప లైంగిక సమస్యలకు మొత్తంగా శరీర అనారోగ్యమే కారణమవుతూ ఉంటుంది. వాస్తవానికి, లైంగిక అవయవాల్లోనే సమస్యలు ఉండడం అన్నది అతి కొంది మందిలోనే కనిపిస్తుంది. ఏమైన ఆధునిక జీవిన విధానాలు, ఆహారపు అలవాట్లు కారణంగా మగవారిలో అంగస్తంభన సమస్యలు, శ్రీఘ్ర స్ఖలన సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరవారిలో అంగస్తంభన సమస్యలతో బాధపడేవారు 30 శాతం మంది,
శ్రీఘ్రస్ఖలన సమస్యలతో బాధపడేవారు 40 శాతం వరకూ ఉంటున్నట్లు కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

* ఇక మధుమేహం ఉన్న వారిలో అయితే, అంగస్తంభన సమస్యలతో బాధపడేవారి సంఖ్య 60 శాతం దాకా ఉంటోంది. అంగస్తంభన సమస్యల్లో అంగం తగినంతగా స్తంభించకపోవడం, స్తంభించిన ఎక్కువ సమయం ఉండకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలికంగా లైంగిక సమస్యలు ఉన్న వారిలో క్రమంగా వారిలో మానసిక సమస్యలు కూడా మొదలవుతాయి.

* కారణాలుః మధ్యపానం, పొగతాగడం, అధిక బరువు వల్ల కూడా ఒక దశలో అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. మధుమేహం, నాడీ సంబంధ వ్యాధులు, సుఖవ్యాధులు,గుండె జబ్బులు కూడా లైంగిక సమస్యలకు కారణమవుతాయి. కొన్ని రకాల హార్మోన్ సమస్యలతో పాటు అధిక రక్తపోటు, అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా కొందరిలో శృంగార సమస్యలు ఏర్పడతాయి.

* వాజీకరణ చికిత్సః లైంగిక సమస్యలను సమర్థవంతంగా నివారించే ఔషధాలెన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇవి ఏ మాత్రం దుష్ప్రభావం లేకుండా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాయి. లైంగిక సమస్యలకు, సంతాన లేమి సమస్యలకు ప్రాచీన ఆయుర్వేద సంహితాల్లో పేర్కొన్న ప్రత్యేక వైద్య విధానమే వాజీకరణ చికిత్స. వాజీకరణ ఔషధాలను 4నుంచి 6 మాసాల పాటు క్రమం తప్పకుండా వాడితే అద్భుతమైన ఫలితాలుంటాయి.

* కాకపోతే ఈ వైద్య చికిత్సలు ఆయుర్వేదంలో మంచి నిపుణులైన వారి పర్యవేక్షణలో తీసుకున్నపుడే ఆశించిన స్థాయి ఫలితాలు వస్తాయి. వాజీకరణతో పాటు, పంచకర్మ చికిత్సలు కూడా వుండటం వల్ల కూడా లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది. శ్రీఘ్రస్ఖలన సమస్య ఉన్న వారికి ప్రత్యేకించి శుక్రస్తంభన ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయి. వాజీకరణ ఔషధాలను 20 నుంచి 70 ఏళ్ల వయస్సు దాకా ఎవరైన వాడవచ్చు.

1 comment: