Welcome To సుఖ-సంసారం

Tuesday, 1 July 2014

భావప్రాప్తి

  భావప్రాప్త్తి (ఆర్గాజం)
శృంగార సాగర మధనంలో మానవులకు మదన దేవతలు బహూకరించిన దివ్వమైన, రసరమ్య కానుక భావప్రాప్తి! సృష్టిలోని కొటానుకోట్ల్ల జీవరాశిలో మానవునికి మాత్రమే భావప్రాప్తి వైభోగం అనుభవించే అదృష్టాన్ని ప్రకృతి ప్రసాదించింది. భావప్రాప్తి పూర్తిగా మనసుకు సంబందించిన అంశం. మానసిక స్థాయిలో అద్భుతమైన పరిణతి సాధించటమే, మానవునికి ఆర్గాజం భోగాన్ని పొందే అర్హత కలిగిస్తోంది! సంభోగం ముగింపు దశలో కలిగే ఈ భావప్రాప్తి స్త్రీ,్తపురుషులలో ఒకేవిధంగా ఉండటం లేదు.

మగవారిలో---- ఉవ్వెత్తున ఎగసిపడే ఉన్మత్త తరంగమై, ప్రఛండ, భీభత్స ఆనంద చంచలనం కాగా....! ఆడువారిలో ----- పండువెన్నెల రాతిరి, మౌనరాగాలు పలికే కొలను మదిలో, మలయమారుత మృదంగ నాదాల చక్కిలిగింతలకు, అలలు అలలుగా కదిలే రసలహరి!!.... ఈ భావప్రాప్తి అనేది సంపూర్ణంగా మనసుకు సంబంధించిన అంశమైనా, దీని నేపధ్యం మాత్రం శారీరకమైనదే!

సంభోగం సందర్భంగా కండరాలు, నాడీ మండలంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి ఏర్పడుతుంది.ఆ ఒత్తిడుల నుండి ఒక్కసారిగావిముక్తి పొందడమే భావప్రాప్తి! సంభోగంలో క్లైమాక్స్‌ దశకు చేరుకున్నప్పుడు, అంతవరకూ పేరుకున్న ఒత్తిడంతా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటంలా బద్దలవుతుంది. భావప్రాప్తిలో మర్మావయవాలలో కలిగే మార్పులు యోనిలోని సుతిమెత్తని కండరాల గుండా శిశ్నం చలించునపుడు చెప్పనలవికాని ఆనందం కలుగుతుంది. కొంతసేపటికి ఆ ఆనందం అత్యున్నత స్థితికి చేరి... పురుషునిలో శుక్రం నిల్వఉండే శుక్రాశయం, శుక్రవాహకనాళం, ప్రొస్టేటుగ్రంధి సంకోచించబడి, వాటియందు విడుదల అయిన ద్రవములన్నీ ఒక్కసారిగా మూత్రవిసర్జన నాళంలోకి నెట్టబడతాయి. అదే సమయంలో వృషణాల క్రిందిభాగం, పురుషాంగ పీఠానికి మధ్యగల కండరాలు సంకోచానికి గురికావటంతో మూత్రవిసర్జన నాళంలోని శుక్రం యోనిలోకి ఒత్తిడితో వెదజల్ల బడుతుంది. కేవలం కొన్ని క్షణాలలో పూర్తికాబడే ఈ ప్రాసెస్‌లో వర్ణింప నలవిగాని మధురానందం కలుగుతుంది.ఆ విధంగా వీర్యస్కలనంతో మగవారు భావప్రాప్తిని పొందుతారు. అయితే కేవలం వీర్యస్కలనంతోనే భావప్రాప్తి కలుగుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే యుక్తవయసు రాకుండానే హస్తప్రయోగం చేసుకొనేవారు, వేసెక్టమీ ఆపరేషన్‌ అయిన పురుషులు వీర్యస్కలనం లేకుండానే భావప్రాప్తిని అనుభవించ గలుగుతున్నారు.

ఆడువారి ఆర్గాజం దశలో అటువంటి స్కలనాలేవీ ఉండవు. రతిలో తారాస్తాయి నొందినపుడు యోనిలో రక్తప్రసరణ అధికం కావటంతో యోనిపెదవులు, క్లిటారిస్‌ ఉబ్బుతాయి. లోపలి కండరములు ఒక విధమైన సంకోచ లయతో స్పందించటంతో యోనిలో కదలాడుతున్న పురుషాంగం, దాని ముందుభాగం(గ్లాన్సు) మరింత బిగుతుగా నొక్కబడుతూ అపరిమితమైన రత్యానందం కలుగుతుంది.అట్టి స్థితిలో యోనిలోని శిశ్నం కదలికల లయ వేగం పుంజుకొంటుంది. సంభోగం తారాస్తాయికి చేరిన ఆ మదనోన్మత్త ఘడియల్లో, అలలు అలలుగా కదిలే ఆనంద చంచలనంలా ఆర్గాజం మధురిమను స్త్రీ అనుభవిస్తుంది.

స్త్రీకి భావప్రాప్తి కలుగబోతోన్న సంగతి 3-4సెకెనుల ముందే తెలుస్తుంది.ఆ దశలో ఆమె కాళ్ళూ,చేతులూ బిగదీసుకుపోతాయి. శరీరంలోని అణువణువూ ఆర్గాజం మధురానుభూతులను ఆస్వాదించేందుకు సమాయత్తమవుతుంది.భావప్రాప్తి ఆనందలహరిలో.. ఆమె చేతులకు అందిన వాటిని(అసంకల్పితంగా) గట్టిగా బిగించి పట్టుకొంటుంది.పొత్తికడుపు అదురుతుంది.పిరుదులు ఎగిరెగిరి పడతాయి.పాదాల వ్రేళ్ళు పరుపులోకి చొచ్చుకుపోతాయి.శరీరమంతా లైంగికరసానందంతో చంచలించిపోతుంది.ఈ సుఖానుభూతి 30సెకెనుల నుండి ఒక నిముషం వరకూ ఉంటుంది.కొంతమందిలో ఇంకా ఎక్కువ సమయం ఉండవచ్చును.

పురుషునిలో భావప్రాప్తి అనుభవం ఉదృతంగా ఒక్కసారి మాత్రమే కలుగుతుంది.కానీ స్త్రీ ఆ అనుభూతిని అలలు అలలుగా పలు మార్లు పొందగలుగుతుంది. రతిలో పాల్గొన్న స్త్రీ పురుషులిద్దరూ ఒకేసారి భావప్త్రిని పొందగలిగితే ఆ అనుభవం అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది.అయితే ప్రతిసారీ ఆలా జరిగే అవకాశం ఉండదు.ఎవరో ఒకరు ముందుగా క్లయిమాక్సుకు చేరుకొంటారు.భాగస్వాములిరువురూ విడివిడిగా ఆర్గాజంను పొందడంలోనూ కొన్ని సౌలభ్యములు లేకపోలేదు.ఆ సమయంలో ఒకరిముఖకవళికలను ఒకరు చూడగలుగుతారు.మరియు స్త్రీ ముందుగా భావప్రాప్తిని అందుకోగలిగితే పురుషునిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది.

అయితే పురుషుడు ముందుగా భావప్రాప్తిని పొందటం జరిగినపుడు మాత్రం... తన పని పూర్తయిపోయిందని తలచి వెంటనే రతినుండి నిష్క్రమిస్తాడు. ఇంకా భావప్రాప్తిని పొందని స్త్రీ గురించి ఆలోచించడు.ఈ చర్య స్త్రీ భాగస్వామిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది.రక్తాధిక్యత పొందిన ఆమె జననాంగ భాగములలో చాలా సేపటివరకూ ఆ స్థితి కొనసాగుతుంది.నిద్రపట్టక అశాంతితో వేదన చెందుతుంది.ఇదే పరిస్థితి పలుమార్లు ఎదురైనపుడు... దీర్ఘకాలం గర్భకోశంలో రక్తాధిక్యత కలిగిన కారణంగా వివిధ గర్భకోశవ్యాధులు, నాడీ మండల సమస్యలు కలుగుతాయి.సంభోగం ఎడల నిరాశ,విరక్తి కలుగుతుంది.

కాబట్టి భర్త తన పని పూర్తయినా భార్య సుఖం గురించి కూడా ఆలోచించాలి.తనకు భావప్రాప్తి కలిగినంతనే యోని నుండి పురుషాంగమును తీసేయకుండా కొంతసమయం అలాగేఉంచాలి.అలా కౌగిలించుకొన్న స్థితిలో కొంతసేపు ఉండటం ఆమెకు ఊరట కలిగిస్తుంది.ఆమె ఆర్గాజం దశకు చేరుకోనేవరకూ క్లిటారిస్‌పె ౖవ్రేళ్ళతో ఒరిపిడి కలిగించాలి. వీర్యస్కలనం జరిగినంతనే రతి నుండి నిష్క్రమించాలని ఉంటుంది.కాబట్టి ఇలా చేయటం మగవాడికి కాస్త ఇబ్బందిని కలిగించే అంశమే! అయినా భార్య తృప్తి కోసం తప్పదుమరి. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సంభోగమునకు ముందు తగినంతగా ఫోర్‌ ప్లే జరపటం ద్వారా స్త్రీకి లైంగికోద్రేకమును కలిగించాలి.అప్పుడు రతిని ప్రారంభించినపుడు స్త్రీ తొందరగా ఆర్గాజంను పొందగలుగుతుంది.

ఎక్కువమంది స్త్రీలలో .. రతిలో కంటే క్లిటారిస్‌,ఇతర యోని భాగములలో వ్రేళ్ళతో స్ప్పశించినపుడు, వక్షోజములను ప్రేరేపించినపుడు భావప్రాప్తి ఉదృతంగా కలుగుతుంది.కానీ కొంతమంది ఆడవారు సంభోగం ద్వారా కాకుండా ఆ విధంగా భావప్రాప్తిని పొందటం అసహజ రతి ప్రక్రియగా భావించి భర్త ఆ విధంగా చేయడానికి అంగీకరించరు.కానీ అది తప్పుడు భావన.భావప్రాప్తి ఏ విధంగా కలిగినా ఆనందదాయకమే.దానిని ఆస్వాదించటంలో సంకోచానికి తావివ్వకూడదు.

భావప్రాప్తిలో స్త్రీలు ఏడుస్తారా? భావప్రాప్తి సమయంలో కొందరు స్త్రీలు గట్టిగా కేకలు పెడతారు.కొందరు మూలుగుతారు. కొంతమంది వెక్కివెక్కి ఏడవగా, మరి కొంతమంది చలనంలేని స్థితిలోకి జారిపోయి మూగబోతారు. మనసు భరింలేని, తట్టుకోలేనంతటి ఆనందానికి గురికావటంతో, వారివారి మనో శారీరక తత్వాల ననుసరించి పలు విధాలుగా ప్రవర్తిస్తారు.వారు పొందినది ఆనందమైనా, ఆ సమయంలో వారి ముఖాలలో బాధ, ఆవేదన కనిపిస్తుంది. పరిణామరీత్యా జంతుదశ నుండి ఎన్నో రెట్ల అభివృద్ధిని సాధించినా మానవునిలో పాత వాసనలింకా పూర్తిగా పోలేదనేందుకు సాక్ష్యమిది. (జంతుజాతుల్లో ఆడువి సంభోగ సమయంలో వేదన చెందుతాయి) భావప్రాప్తి సమయంలో స్త్రీలు ఏడవటాన్ని 'హోయోట్రిస్టీ' అంటారు.అప్పుడు వారి కళ్ళల్లో కన్నీళ్ళూ వస్తాయి.కానీ అవి ఆనందభాష్పాలు.భావప్రాప్తి కొంతమందిలో హృదయం భరించలేనంతటి మధురానందమును కలిగిస్తుంది. అప్పుడే హోయోట్రిస్టీ కలుగుతుంది.

శృంగారంలో యోని నుండి స్రావాలు ఎందుకు ఊరతాయి?
స్త్రీకి లైంగికోద్రేకం కలిగినపుడు గర్భాశయం వద్దనున్న గ్రంధులు కొన్ని స్రావాలను విడుదల చేస్తాయి. రతి సమయంలో శిశ్నం కదలికల వలన యోనిలో ఘర్షణ ఏర్పడి, మంటగా అనిపించకుండా జారుడుగా, సుఖమయంగా ఉండేందుకు ఈ స్రావాలు లూబ్రికెంట్‌లు(కందెనలు)గా ఉపయోగపడతాయి.

భావప్రాప్తిలో దేహంలో కలిగే మార్పులు భావప్రాప్తిపై పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు సున్నితమైన ఆధునిక పరికరాల సహాయంతో సంభోగ సమయంలో స్త్రీ,పురుషుల శారీరాలలో సంభవించే పలు మార్పులను గుర్తించారు.... భావప్రాప్తిని పొందు సమయంలో స్త్రీ, పురుషుల శరీరాలలో కొన్ని అకస్మిక మార్పులు ఉత్పన్నమవుతాయి. ఉదర వితానం(నాభి పై భాగం) పైకి వ్యాకోచిస్తుంది. దాని వలన గుండె యొక్క స్థితిలో మార్పు వస్తుంది. ఫలితంగా శ్వాశావయవాల కదలికలందు కూడా మార్పు కలగటంతో, శ్వాస లోతు పెరుగుతుంది. దాంతో ఛాతిలో నిల్వఉండే గాలి పరిమాణం అధికమవుతుంది. రక్తపోటూ పెరుగుతుంది. ఫలితంగా మెటాబాలిక్‌ రేటు అధికమవుతుంది. శ్వాస లోతు పెరగటం వలన, రక్తంలో కలిసే ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం వలన శరీర ధాతువులకు ఆహారమైన రక్తం సరఫరా అధికమవుతుంది.

ఈ ప్రక్రియలో శరీరంలో ఉండే గ్లూకోజ్‌ నిల్వలు విస్తారంగా ఆక్సిడేషన్‌ చెందటంతో శక్తి ఉత్పత్తి (మెటాబాలిక్‌ రేటు) పెరుగుతుంది. ఈ సందర్భంగా ఎడ్రినాలిన్‌ రసాయనాల ఉత్పత్తి కూడా అధికమవుతుంది. భావప్రాప్తి దశలో యోని, గర్భ కోశంతో బాటు, మూత్రాశయ, మలాశయాలూ సంకోచ చలనాలకు గురి అవుతాయి. క్లయిమాక్సు దశలో స్త్రీ పురుషుల రక్తపోటులో తేడా రక్త పరిమాణం, రక్తపోటు, నాడి వేగం స్త్రీ, పురుషు లిరువురి యందూ పెరుగుతున్నప్పటికీ, ఆ పెరుగుదలలోనూ వీరిద్దరి నడుమ కొద్దిపాటి తేడాలున్నాయి. పురుషునిలో నాడివేగం నిముషానికి 140, రక్తపోటు 250 ఎమ్‌.ఎమ్‌ -హెచ్‌.జి, రక్త పరిమాణం నూటికి 170 వరకూ పెరగగా.......... స్త్రీలో నాడి వేగం 103, రక్తపోటు160 ఎమ్‌.ఎమ్‌ -హెచ్‌.జి. రక్త పరిమాణం నూటికి 130 వరకూ మాత్రమే పెరుగుదల నమోదైంది. పై మూడు మార్పులూ పురుషుని కంటే స్త్రీలో మెల్లగా ఉండటం వలన ఆమెలో అలసట కూడా స్వల్పంగానే ఉంటుంది.

భావప్రాప్తిలో కంటిపాపలు పెద్దవవుతాయా!
భావప్రాప్తి సమయంలో స్త్రీ పురుషులు ఇరువురిలోనూ కంటిపాపల పరిమాణం పెరుగుతోంది.చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే సహజంగా కంటిపాప పరిమాణం పెరుగుతుంది. కాని విచిత్రంగా వెలుతురిలోనే ఉన్నప్పటికీ సంభోగ సమయంలో కంటిపాప పెరుగుదలను గుర్తించారు. లైంగికోద్రేకంతో బాటు ప్రారంభమైన కనుపాపల పెరుగుదల, భావప్రాప్తికి ముందు అత్యధికమై (8.2ఎమ్‌.ఎమ్‌), చివరి క్షణలో 5.25 ఎమ్‌.ఎమ్‌కు తగ్గినట్టుగా గుర్తించారు.

రక్తనాళములు మాత్రం ఆర్గాజంనకు ముందు సంకోచిస్తూ, ఆర్గాజం దశలో హఠాత్తుగా వ్యాకోచిస్తున్నాయి. భావప్రాప్తి పొందటంలో ఇరువురి నడుమ భేదం స్త్రీ కంటే పురుషునిలో లైంగికోద్రేకం తొందరగా కలుగుతుంది. స్త్రీ శరీరస్పర్శ తగలక మునుపే లైంగికోద్రేకానికి లోనవుతాడు. అయితే ఎంత త్వరగా కలుగుతుందో అంతే వేగంగా చల్లబడిపోతాడు. భాప్రాప్తి విషయంలోనూ అంతే....సాధారణంగా పురుషుని కంటే స్త్రీలో భావప్రాప్తి కాస్త నిదానంగా కలుగుతుంది. ముద్దులు, కౌగిలింతలు, కుచమర్దనము, సరస సంభాషణము, క్లిటారిస్‌, యోని పెదవులను మృదువుగా మర్దించుట మొదలైన లైంగిక చర్యల ప్రభావంతో లైంగికోద్రేకంను నిదానంగా పొందుతుంది.

మగవాడు ఒక్కసారి రత్యున్నతానందం (ఆర్గాజం) పొందితే కొంతసేపటి వరకూ రతికి సన్నద్ధం కాలేడు. కానీ స్త్రీ వెనువెంటనే ఆర్గాజం పొందగలదు. ఒక్కసారి మైధునానికి సిద్దపడితే తాను అలసిపోయేంత వరకూ ఎంతసేపైనా రతిలో పాల్గొనగలదు. సంభోగసమయంలో పలుమార్లు భావప్రాప్తినీ అనుభవించగలదు. పురుషులు పెళ్ళైన కొత్తలో శృంగారంలో తరచూ పాల్గొంటూ తృప్తిని పొందుతుంటారు. కానీ స్త్రీలు అలాకాదు... కొన్నేళ్లపాటు దాంపత్య జీవితం అనుభవించిన తర్వాతనే భావప్రాప్తి అనుభవాలను ఎక్కువసార్లు పొందగలరు.

పురుషాంగమునకు తగినంత ఒరిపిడి లేకుండా మగవాడు క్లయిమాక్స్‌ అనుభవాన్ని పొందలేడు. కానీ స్త్రీలు(కొంతమంది) కేవలం వక్షోజాల ప్రేరేపణకే భావప్రాప్తిని అందుకుంటారు. ఇది వాళ్ళ అదృష్టమనే చెప్పాలి.అయితే రతి ద్వారా లభిస్తుందనుకొంటున్న ఆర్గాజం అనుకోకుండా ఈ మార్గం ద్వారా దక్కటంతో ఆ స్త్రీలు మొదట్లో కొంత కంగారు పడతారు కూడా! మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. తన శరీరంపై ఏ స్పర్షా లేకుండానే, ఏ రకమైన సెక్సూ లేకుండానే కేవలం ఊహల ద్వారా సైతం స్త్రీ భావప్రాప్తిని పొందగలదు! జి.స్పాట్‌పై పలు పరిశోధనలు చేపట్టిన డాక్టర్‌ లివర్లీవిపుల్‌ ద్వారా ఈ విషయం వెల్లడైంది.

భావప్రాప్తి సమయంలో కాళ్ళెందుకు వణుకుతాయి.
శృంగార సమయంలో స్త్రీ పురుషులిరువురి శరీర భాగాలలో టెన్సన్‌ కలుగుతుంది. అది క్రమంగా పెరిగి,పెరిగి భావప్రాప్తి కలగటంతో ఒక్కసారిగా పడిపోతుంది. ఈ నేపధ్యంలో కొంతమందిలో కాళ్ళ కండరాలలో వణుకులా పుడుతుంది.ఈ వణుకును ఆపుదామనుకొన్నా సాధ్యం కాదు.కొంతసేపటి తరువాత రక్తప్రసరణ సాధారణ స్థాయికి చేరుకోగానే దానికదే సర్దుకొంటుంది.ఈ స్థితి కలగటం స్త్రీలకంటే పురుషులలోనే ఎక్కువ.

రతిలో స్త్రీకి ఎందుకు అసంతృప్తి కలుగుతుంది?
సంభోగంలో పాల్గొన్న భార్యా భర్తలిరువురూ ఒకేసమయంలో భావప్రాప్తిని అనుభవించగలిగితే ఆ అనుభవం అత్యంత మధురమైన శృంగారయోగ మవుతుంది. ఈ ప్రక్రియను సాధించు దంపతులకు ఆరోగ్యంతో బాటు, సంపూర్ణ శృంగారసిద్ది లభిస్తుంది. అయితే ఈ స్థితి కలగటానికి భాగస్వాము లిరువురికీ సంభోగంపై అవగాహన అవసరం. ఇదివరకు చెప్పినట్టుగా పురుషుడు లైంగికోద్రేకం మరియు భావప్రాప్తి తొందరగా పొందగా, స్త్రీలో కాస్త నిదానంగా కలుగుతాయి. వీర్యస్కలనం కాగానే మగవాడు యోని నుండి పురుషాంగమును బయటకు తీసి, రతి నుండి విరమిస్తాడు. ఆ స్త్రీ మాత్రం ఇంకా భావప్రాప్తిని పొందకపోవటంతో తీవ్ర ఆసంతృప్తికి లోనవుతుంది. రక్తాధిక్యత చెందిన గర్భకోశం, క్లిటారిస్‌, యోనిలోని ఇతర భాగాలు రతి అనంతరం కూడా అదే స్థితిలో చాలా సమయం వరకు ఉండటం వలన ఆ స్త్రీకి తీవ్ర మానసిక క్షోభ కలుగుతుంది.ఆ తరువాత సరిగా నిద్రపట్టక అశాంతికి లోనవుతుంది. అదే అనుభవం పలుమార్లు కొనసాగితే గర్భకోశం, నాడిమండలానికి చెందిన సమస్యలు చుట్టుకొంటాయి. చివరకు అతనితో సంభోగ కార్యక్రమం అంటేనే ఆమెకు విముఖత కలుగుతుంది.

స్త్రీకి సంతృప్తిని కలిగించాలంటే......
స్రీని సంతృప్తి పరచాలంటే మగవాడు కొన్ని పద్ధతులను విధిగా పాటించాలి. సాధారణంగా మగవాడు స్కలనమైన వెంటనే యోని నుండి శిశ్నమును బయటకు తీయటం సహజం. కానీ అలా చేయకూడదు. ఇది మగవానికి కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే అయినా భార్యను సంతృప్తి పరచాలంటే తప్పదు మరి. ఆమెకు భావప్రాప్తి కలిగే వరకూ క్లిటారిస్‌ను వ్రేలితో మర్దనా చేస్తుండాలి. సంభోగంలో ఏర్పడిన భంగిమలోనే కంటిన్యూ కావాలి.అంటే ఆమె నుండి విడిపోకుండా దేహమును ఆమె శరీరమునకు ఆనుకొని లేదా బిగియార కౌగలించుకొని కొంతసేపు ఉండాలి.సరస సంభాషణను కొనసాగించాలి.రతికి ముందు ఫోర్‌-ప్లే ను తప్పనిసరిగా జరపాలి. అప్పుడు ఆమెలో లైంగికోద్రేకత కలిగి రతికి సమాయత్తమవుతుంది.తదనంతరం పురుషుడు సంభోగానికి ఉపక్రమించినపుడు తొందరగా భావప్రాప్తిని పొందగలుగుతుంది.ఆ స్థితిలో ప్రేరేపనను మరింతగా కొనసాగించినపుడు మరలా మరలా ఆర్గాజం(మల్టిఫుల్‌ ఆర్గాజం)ను ఆస్వాదించగలదు కూడా!

కొందరు స్త్రీలకు భావప్రాప్తి ఎందుకు కలగదు?
శృంగారంలో భర్తతో బాటు భార్య కూడా సమానంగా యాక్టివ్‌ పార్ట్‌ తీసుకొన్నప్పుడే దాంపత్య సౌఖ్యాన్ని ఆమె యధేచ్చగా అనుభవించగలుగుతుంది.కానీ మొదటి నుండీ సమాజంలో స్త్రీ స్థానం ద్వితీయంగానే ఉంటూ వస్తోంది.శృంగారంలో సైతం అదే అణచివేత ధోరణి కొనసాగుతోంది.ఈ నేపధ్యం.. స్త్రీ పురుషునికి సుఖాన్నందించే వస్తువు మాత్రమే అనే భావనను ఆమెలో నింపివేసింది.ఫలితంగా శృంగారమనేది పురుషుడు మాత్రమే ప్రారంభించవలసిన కార్యమని, తమంత తాముగా ఉత్సాహంగా పాల్గొనాల్సిన అవసరం లేదని స్త్రీ భావిస్తుంది.అన్ని రంగాలలోనూ పురుషునితో సమానంగా దూసుకుపోతున్న ఈ ఆధునిక కాలంలో సైతం చాలామంది స్త్రీలు ఆ రకమైన భావనల నుండి బయట పడలేకపోతున్నారు.

శృంగారంలో భార్య ఒకవేళ సెక్సు విషయాల గురించి మాట్లాడినా,భర్తని డామినేట్‌ చేస్తూ ఉత్సాహాన్ని చూపినా భర్త భరించలేడు.ఆమె నైతిక ప్రవర్తనే అనుమానించే స్థితికి చేరుకొంటాడు. దాంపత్య జీవితంలో స్త్రీకి సంతృప్తిని కలిగించాలంటే పురుషుడు తనతో సమానంగా ఆమెను గుర్తించాలి.శృంగారంలో ఎలా చేయటం ఆమెకు ఆనందదాయకమో తెలుసుకోవాలి.శరీరంలో ఏయే భాగాలలో స్పర్శలు ఆమెకు లైంగికానందమును, ఉద్రేకమును కలిగిస్తాయో గ్రహించాలి.ఆ ప్రకారం పురుషుడు మైధునంలో పాల్గొన్నప్పుడు స్త్రీ నిస్సంకోచముగా రతిసౌఖ్యాన్ని ఎంజోయ్‌ చేస్తూ భావప్రాప్తిని పొందగలదు.అయితే...

కొంతమంది స్త్రీలు సెక్సు అంటే కేవలం సంతానం కోసమేనని భావిస్తారు.శృంగారమనేది మధురాతి మధురమైన క్రీడ వంటిదని,గర్భం రావటమన్నది శృంగారం ప్రసాదించిన ఒకానొక ఫలితం మాత్రమేనని వారికి తెలీదు.అటువంటి వారు భావప్రాప్తిని పొందలేరు. కొందరు స్త్రీలు.. సెక్సులో పాల్గొనటాన్ని తప్పుడుపనిగా భావిస్తారు. వారు పెరిగిన వాతావరణం ప్రభావం చేతనో,మత విశ్వాసం వల్లనో వారిలో అలాంటి భావనలు కలిగి భావప్రాప్తిని దూరం చేస్తాయి. మరికొందరికి సెక్సులో భావప్రాప్తి అనే మధురమైన దశ ఉంటుందనే తెలీదు.అయినా వారు సెక్సును బాగానే ఎంజోయ్‌ చేస్తారు.భావప్రాప్తి అనుభవాల గురించి ఇతరులు మాట్లాడుకొన్నప్పుడు తామేదో కోల్పోయామనే భావన వారిలో కలుగుతుంది.భావప్రాప్తి గురించి తెలుసుకోకపోవటమే వారి సమస్యకు ప్రధాన కారణమవుతుంది.

కొంతమంది స్త్రీలు శృంగారం మంచి రసపట్టులోనున్న సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.ఆవిధంగా ఆర్గాజం మధురిమలకు దూరమవుతారు. భర్తకు శ్రీఘ్రస్కలన సమస్య ఉన్నప్పుడూ ఆమె భావప్రాప్తిని పొందే అవకాశముండదు. ఎందుకంటే అంగ ప్రవేశం జరిగిన అతి కొద్ది సేపటికే అతనికి స్ఖలనం జరిగిపోతుంది.ఈ సమస్యను నివారించుకొనే ప్రయత్నం చేయకుండా దీర్ఘకాలం కొనసాగినపుడు పరిస్తితి మరింత జఠిలమవుతుంది.చివరికి శృంగారం అంటేనే ఆమెకు విరక్తి కలిగే దుస్థితి ఏర్పడుతుంది.

భర్తకు అంగస్థంభన సమస్య ఉంటే ఆ స్త్రీ లైంగిక జీవితమే నిర్వీర్యమవుతుంది. శ్రీఘ్రస్కలన బాధితుల భార్యలు రత్యనంతరం స్వయంతృప్తి ద్వారా అయినా తృప్తిపొందే అవకాశముంటుంది.కానీ దీర్ఘకాలం అంగ స్థంభన సమస్యతో బాధపడే వారి భార్యలకు ఆ ఛాన్సు కూడా లేదు.ఎందుకంటే అప్పటికే శృంగారంపై ఆమెకు ఆసక్తి నశించిపోతుంది. భర్తపై ఇష్టం లేకపోయినా, అతని ప్రవర్తన నచ్చకపోయినా, శృంగారంలో మగాడు మరీ దూకుడుగా, మొరటుగా వ్యవహరించినా ఆ స్త్రీ ఆనందం పొందలేదు.ప్రేమించే భర్త లభించినప్పటికీ శృంగారకేళిలో అంగ ప్రవేశం బాధాకరంగా ఉండే సందర్భాలు ఎదురైనా ఆ స్త్రీ భావప్రాప్తికి దూరమవుతుంది.ఆలాగే కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడూ వాటి ప్రభావంచేత భావప్రాప్తి అనుభవాలను కోల్పోవచ్చు.

శృంగార సమయంలో కొందరు మగవారు భార్యలను ' తృప్తి కలిగిందా?..' అంటూ పదేపదే అడుగుతుంటారు. తృప్తి కలగలేదంటే భర్తకు అసంతృప్తి కలిగి,అతని ఆత్మవిశ్వాసం ఎక్కడ దెబ్బతింటుందోనని .. కలిగిందంటూ అబద్దం చెబుతారు.ఇదే సన్నివేశం భార్యాభర్తలు రతిలో పాల్గొన్న ప్రతిసారీ చోటుచేసుకున్నప్పుడు ఆ స్త్రీకి చిరాకు కలుగుతుంది.
భార్యకు సంతృప్తిని కలిగించాలంటే శృంగారంలో ఆమె యిష్టాయిష్టాల గురించి తెలుసుకోవాలి .. ఎలా చేయటం ఆమెకు ఆనందాన్నిస్తుందో,శరీరంలో ఏఏ భాగములలో స్పర్శలు ఆమెకు లైంగికోద్రేకంను కలిగిస్తాయో గ్రహించాలి.సహజంగా స్త్రీకి మొదటిసారి తృప్తి ఆలశ్యంగా కలుగుతుంది.రెండవసారి తొందరగా కలుగుతుంది.కానీ పురుషుని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది.మొదటి ప్రయత్నంలో తొందరగా స్కలనం జరుగిపోగా,ఆ తరువాతి నుంచీ లేటుగా ఆవుతుంది.అందుకే తగినంతసేపు ఫోర్‌ప్లే జరిపాకే స్త్రీతో రతికి సిద్ధం కావాలి.

సంభోగం ద్వారా మాత్రమే స్త్రీకి సంతృప్తి కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.50నుండి 75శాతం మంది స్త్రీలు రతికి ముందు,తర్వాత ప్రేరేపణలుంటేనే గాని తృప్తి పొందలేరని వివిద అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అలాగే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి స్త్రీ ఆర్గాజంను పొందుతుందనీ చెప్పలేం.వివాహం జరిగిన తొలి సంవత్సరాల కన్నా ఆ తర్వాతి కాలంలో స్త్రీలు 85 శాతం సందర్భాలలో భావప్రాప్తిని పొందగలుగుతున్నారని వివిధ రీసెర్చ్‌ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రఖ్యాత సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ కిన్సే నిర్వహించిన పలు అధ్యయనాలలో... యువతుల కంటే మధ్య వయస్కురాలైన స్త్రీలు ఎక్కువసార్లు భావప్రాప్తి అనుభవాలను పొందుతారని వెల్లడి అయింది.

వాస్తవానికి యువతులే సెక్సులో ఎక్కువసార్లు పాల్గొంటారు.అయినా తక్కువసార్లు మాత్రమే ఆర్గాజంను పొందుతుంటారు.35-40 లలో ఉండే స్త్రీలు శృంగారంలో తక్కువసార్లు పాల్గొన్నప్పటికీ ఎక్కువ సార్లు భావప్రాప్తిని పొందుతారు.దాంపత్య జీవితం గడిచేకొద్దీ ఆమెలో లైంగిక జీవితానందం పట్ల అవగాహన పెరుగుతోంది.ఫలితంగా సెక్సు మాధుర్యపు లోతులను చవిచూసే ఆమె పరిధీ పెరుగుతోంది. వైవాహిక జీవితం గడిచే కొద్దీ స్త్రీలలో సెక్సు గురించిన వ్యతిరేక భావనలు క్రమంగా సమసిపోతాయి.దాంతో శృంగారాన్ని ఏ విధమైన జంకూ - గొంకూ లేకుండా యధేచ్ఛగా అనుభవించగలుగుతారు.దానికితోడు వయసు పెరిగే కొద్దీ మగవారిలో అంగస్థంభనకు పట్టే సమయం పెరుగటం వలన ఉపరతి(ఫోర్‌ప్లే)లో ఎక్కువ సేపు పాల్గొంటారు.స్తంభించిన తరువాత స్ఖలనానికి పట్టే సమయం కూడా ఎక్కువగా ఉండటం వలన రతిలో ఎక్కువసేపు పాల్గొనటం కూడా స్త్రీకి అత్యధికమైన ఆనందాన్ని కలిగించి సంపూర్ణమైన భావప్రాప్తి అనుభవాలను ప్రసాదిస్తుంది



Click Here To Contact me

No comments:

Post a Comment