లైంగిక విజ్ఞానం
అణువు 
మొదలుకొని అంతరిక్షం వరకూ గల అనేక అంశాలపై అసంఖ్యాకమైన విజ్ఞాన గ్రంధాలు 
నేడు అందుబాటులో ఉన్నాయి.అయితే సృష్టి వికాసానికి మూలాధారం, మానవ జీవిత సుఖ
 సంతోషాలకు జీవాధారమైన లైంగికతకు సంబందించిన విజ్ఞానంపై మాత్రం ఇంతవరకూ 
ఒక్క గ్రంధమైనా అధికారికంగా వెలువడకపోవటం ఆశ్చర్యకరమూ.. శోచనీయం !!
అందుచేతనే
 ఈ ఆధునిక యుగంలో సైతం పలు లైంగిక అంశాలపై ఎన్నో తప్పుడు ఆలోచనలు, తెలివి 
తక్కువ అభిప్రాయాలు సమాజంలో చెలామణిలో ఉన్నాయి. విధ్యాధికులు కూడా హస్త 
ప్రయోగం,అంగస్తంభనం,రాతుస్రావం, కన్నెపొర మొదలగు సెక్సువల్ సంగతుల పట్ల 
అపోహలు,తప్పుడు అభిప్రాయములు కలిగి ఉన్నట్టుగా సర్వే ఫలితాలు 
వెల్లడిస్తున్నాయి.పట్టణాలలో ఉండే విద్యావంతుల సంగతే ఇలా ఉంటే పల్లెల్లో 
నివసించే గ్రామీణుల లైంగిక విజ్ఞానం ఏ మేరకు ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఈ
 రోజుల్లో పెద్దవారి కంటే పిల్లలే చాలా స్పీడుగా దూసుకుపోతున్నారు. ఎవరూ 
చెప్పకుండానే ఎన్నో విషయాలు తెలుసుకొంటున్నారు.ఈ విషయంలో ఇంటర్‌నెట్ పాత్ర
 అద్వితీయమైనది. అయితే సెక్సువిజ్ఞానానికి సంబందించి అధికారికమైన సమాచారం 
ఇక్కడ కూడా తగినంతగా లభించడం లేదు.అశ్లీల వెబ్‌సైట(్లఫోర్నో) హోరులో యువత 
చెడిపోతున్నారు. సెక్సువల్ పెర్వెర్టర్స్‌గా తయారవుతున్నారు.
అనాది
 నుండీ సెక్సును చీకటి వ్యవహారంగా పరిగణించి, దాని గురించి మాట్లాడటమే 
పాపంగా భావిస్తూ వచ్చారు. ఏదైనా సరే గుట్టుగా ఉంచినంతసేపూ దానిపై ఆసక్తి 
అధికమవుతూనే ఉంటుంది.అది కాస్తా రట్టు(ఓపెన్)చేసేస్తే, ఓస్... ఇంతేకదా 
అనిపిస్తుంది.సెక్సు కూడా అంతే! సెక్స్ ఎడ్యుకేషన్ పొందటం వలన లైంగిక 
విషయాల పట్ల స్పష్టమైన అవగాహన కలుగుతుంది.సంసార జీవితాన్ని ఎలా ఆనందమయం 
చేసుకోవాలో అర్ధమవుతుంది.అప్పుడు చుట్టుపక్కల వారు చేప్పే కొన్ని సంగతులు 
ఎంత నిరాధారమైనవో అవగతమవుతుంది.లైంగికత యొక్క పరమార్ధికత సుబోధకమవుతుంది.
కాబట్టి
 సెక్సు ఎడ్యుకేషన్ ఆవశ్యకతను తల్లిదండ్రులు గమనించి,తమ పిల్లలకు 
మార్గదర్శకులుగా వ్యవహరించాలి. యుక్త వయసు వచ్చేవరకూ ఆగకుండా 
చిన్నప్పటినుండే లైంగిక అంశాల పట్ల వారిలో అవగాహన కలిగించాలి.సెక్సు 
విషయాలు కూడా సాధారణమైన విషయాలే అన్నట్టుగా మాట్లాడుతుండాలి.ఏదో పాఠం 
చెబుతున్నట్టుగా గాకుండా, సందర్భానుసారంగా వివరించటం మంచి పద్దతి.ఉదాహరణకు-
 టీవిలో కండోం గురించిన ప్రకటన వస్తుందనుకొందాం.అప్పుడు కండోం గురించి, 
దానితో సంబందమున్న ఇతర అంశాల గురించి చెబితే ఇంప్రసివ్‌గా ఉంటుంది.సెక్సు 
ఎడ్యుకేషన్‌కు సంబందించిన ఇటువంటి విషయాలన్నింటి గురించి మీ పిల్లలకు 
వివరంగా చెప్పాలంటే ముందుగా మీకు క్షుణ్ణంగా తెలియాలి కదా! ఆ లక్ష్య సాధన 
కోసమే ఈ..... లైంగిక విజ్ఞానం !!
లైంగిక విజ్ఞానం ఆవశ్యకత
సెక్సు
 ఎడ్యుకేషన్ ప్రచారంలో దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ 
చాల ముందంజలో ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు.ఈ విషయంలో వార్తా పత్రికల 
పాత్ర చెప్పుకోతగ్గది.డాక్టర్ సమరం,డాక్టర్ పావులూరి కృష్ణచౌదరి,శ్రీ 
వేమవరపు వేంకట రమణ శర్మ,డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాశ్,డాక్టర్ 
భారతి,డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి.డాక్టర్ ఎస్ దోనెపర్తి,డాక్టర్ 
కడిమెల శ్రీధర్,డాక్టర్ చిరుమామిళ్ల మనోహర్,డాక్టర్ కూనపరెడ్డి 
శివశంకర్ వంటి ప్రముఖ(ఆయుర్వేద,హోమియో,ఆల్లోపతి వైద్య విభాగాలకు 
చెందిన)వైద్యులు సెక్సువిజ్ఞానం గురించి పత్రికాముఖంగా,పుస్తకముల ద్వారా 
ప్రచారం చేస్తూ లైంగిక విషయాల పట్ల ప్రజలలో నెలకొన్న ఎన్నో అపోహలు, 
ఎన్నెన్నో అనుమానాలను,తప్పుడు అభిప్రాయాలను తొలగించి,ఆరోగ్య శృంగారం పట్ల 
అవగాహన కలిగించే మహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వం
 ఇలాంటి నిపుణులైన డాక్టర్లను వినియోగించుకొని విధ్యార్ధులకు ఉపయోగపడే 
విధంగా లైంగిక విధ్యకు సంబంధించిన అమూల్యమైన పాఠాలను వ్యాసాలను కూర్చి 
పాఠ్యాంశాలలో చేర్చినట్లైతే విద్యార్ధినీ విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తంగా 
ఉంటుంది. వారి లైంగిక జీవితానికిసంబందించి కలిగే అనేక అపోహలు, అనుమానాలు, 
సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రదమైన శృంగారం ఎడల చక్కని అవగాహన 
కలుగుతుంది.టీనేజ్ సెక్సు, సుఖవ్యాధులు,ఎయిడ్స్ వలన కలిగే హానిని యువత 
అర్ధం చేసుకోగలుగుతారు. సమాజశ్రేయస్సు సర్వతోముఖమవుతుంది.
ఒకప్పుడు 
కాలేజి విద్యార్ధులకు సైతం సెక్సు గురించి సరిగా తెలిసేది కాదు.ప్రస్తుత 
రోజులలో బోర్డు స్కూలు పిల్లలు సైతం ప్రేమా-దోమా అంటూ ఒకరి వెంట ఒకరు పడటం 
మామూలైపోయింది.చాలామంది స్టూడెంట్స్ చదువు మీద కంటే సెక్సు అంశాల పట్ల్లే 
అమితాసక్తి కనబరుస్తున్నారు.బాగా చిన్న వయసులోసెక్సులో పాల్గొనటం అనేది.. 
స్త్త్రీలలో సరైకల్ కేన్సర్, వారి ప్రత్యుత్పతి అంగాలలో క్షయవ్యాధిని 
కలిగించే కారణాలలో ప్రధానమైనదని ఇక్కడ గుర్తుంచుకోవాలి.వివాహితులలో సెక్సు 
సమస్యల కారణంగా ఎన్నో కాపురాలు చెదిరిపోవటం మన చుట్టూ చూస్తూనే ఉన్నాం.
వారికి
 సెక్సు కావాలి. కానీ సెక్సు గురించిన విలువైన సంగతులేవీ వారికి 
తెలీదు.తెలుసుకొందామన్నా లైంగిక విజ్ఞానానికి సంబంధించిన గ్రంధములేవీ 
అధికారకముగా ప్రచురింపబడలేదు.మానవ జీవితాన్ని సుఖమయం చేసే అంశాలలో అతి 
ప్రధానమైది శృంగారం.అటువంటి శృంగారానికి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా 
బోధించే కోర్సులేవీ ఏ కళాశాలల్లోనూ లేవు.సెక్సుకు సంబంధించిన అంశాల గురించి
 ఔత్సాహికులైన కొంతమంది గైనకాలజిస్ట్‌లు,యూరాలజిస్ట్‌లు ,సైకాలజిస్ట్‌లు 
వారి అభిరుచు మేరకు అదనంగా స్టడీ చేసి తెలుసుకొంటున్నారు. అందుకనే 
అభివృద్ధి చెందిన అనేక దేశాల మాదిరిగా సెక్సు-ఎడ్యుకేషన్‌ను పాఠ్యాంశాలలో 
చేర్చి తరగతి గదులలో బోధించవలసిన అవసరం ఎంతైనాఉంది.
ఇంటర్‌నెట్లో 
సెక్స్ ఎడ్యుకేషన్‌కు సంబందించిన సమాచారం లభిస్తోంది. సెక్సుకు సంబందించిన
 పలు రకాలైన అంశాలు వేరువేరు వెబ్ సైట్లలో తగుమాత్రంగా లభిస్తోంది.ఆయా 
వెబ్‌సైట్ల గురించి తెలిస్తేనే వాటిలోని ఆయా విశేషాలు తెలుస్తాయి. సమాచార 
సముద్రమని పిలుచబడే వికిపిడియాలో సైతం సెక్స్ ఎడ్యుకేషన్‌కు సంబందించిన 
ఇన్ఫర్మేషన్ (ముఖ్యంగా తెలుగులో)చాలా స్వల్పంగానే లభిస్తోంది.పైన 
పేర్కొన్న అంశాలనన్నింటిని పరగణనలోకి తీసుకొని శృంగార విజ్ఞానానికి 
సంబంధించిన సమస్త విషయాలు, విశేషాలను సులభశైలిలో సవివరముగా అందించాలనే 
ప్రయత్నంలో......teluguboothukathal@gmail.com 
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment