యువకులలో సహజంగా సెక్స్ కోరికలు ఎక్కువగానే ఉంటాయి. వారిలో కలిగే సెక్స్ 
సమస్యలు పరిష్కరిచడం చాలా సులభమని చాలామంది అనుకుంటూ వుంటారు. నిజానికి 
యువకలలో సెక్స్ సమస్యలు పరిష్కరించడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి 
వస్తోంది. పెర్పామెన్స్ యాంగ్జయిటీ గూర్చి నిరంతరం ఆలోచిస్తూ వుండటం కూడా 
సెక్స్ సమస్యను పెంచుతోంది. 
20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలవారిలో పెళ్లి అయినవారిలో మధ్య వయస్సు
 కలవారిలో పెళ్లి అయినవారిలోనూ పెళ్లికాని వారిలో సెక్స్ సమస్యలు ఎక్కువగా 
కనబుతున్నాయి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చెయ్యడం కొందరిలో వుంటే, ఇంట్లో 
వాళ్ల ఒత్తిడి వలన కడా సమస్య క్లిష్టమవుతోంది. అనేక శతాభ్దాలుగా సెక్స్ 
సామర్ధ్యం, సెక్స్ నిర్వహించాలసిన బాధ్యత పూర్తిగా మగవానిపైనే వుండడంతో 
పెర్ఫామెన్స్ యాంగ్జయింటీ ఫలితంగా మగవాళ్లో అంగస్తంభన సమస్య ఎక్కువుతోంది 
మగవాళ్లో కలిగే ఇతర సెక్స్ సమస్యలకంటే అంగస్తంభన సమస్యయెంతో విభిన్నమైంది. 
 
1.అంగస్తంభన సమస్యకు దారితీసే కొన్ని కారణాలు పరిస్థితులు చూద్దాం : 
2.శ్రీఘ్రస్కలనం ఫలితంగా అంగస్తంభన సమస్య 3.ఎక్కవ మోతాదులో మధ్య 
సేవించినందువలన కలిగిన అంగస్తంభన సమస్య 4.కుటుంబంలో తల్లీ పెత్తనం ఎక్కువగా
 వున్నందువలన కలిగే సమస్య.  5.మత చాందస్త ఎక్కువగా వున్నందువలన కలిగే 
సమస్య. 6.హోమియో సెక్సువల్ లో కలిగే అంగస్తంభన సమస్య...
 వీటిని గూర్చి వివరంగా మాస్టర్స్ అండ్ జాన్సన్ లు వివరించారు. అంగస్తంభన 
సమస్య కలిగినవారిలో కమ్యూనికేషన్ వుండదు. బెడ్ రూంలో కమ్యూనికేషన్ లోపం 
యెక్క ప్రభావం సెక్స్ జీవితం పైన పడుతుంది. వివాహం నిశ్చయమైంది అనగానే 
అప్పటిదాకా బాగా వున్నవారిలో కూడా పెర్పెమెన్స్ యాంగ్జయిట్ మొదలయ్యి 
అంగస్తంభన సమస్య మొదలవుతుంది మరికొందరిలో వివాహనికి అనేకే సంవత్సారాల తరు 
ముందునుంచే అంగస్తంభన సమస్య ఉంటుంది. 
దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తారు. తల్లిదండ్రులు ఒత్తిడి ఫలితంగా 
వివాహానికి ఒప్పుకుంటారు. ఇలాంటివారిలో అప్పటికే వున్న సమస్యకు 
పెర్ఫెమెన్స్ యాంగ్జయిట్ తోడయ్యి సమస్య మరింత తీవ్రమవుతుంది. తొలిరాత్రి 
తాలూకు భయం చాలామందిలో ఉంటుంది. అనేక కారణాలవలన తొలిరాత్రి జరగదు. ఆ భయంతో 
కూడా అంగస్తంభన సమస్య మొదలవుతుంది. సెక్స్ గూర్చి పరిజ్ఞానం ఇద్దరిలో 
లేనందువలన స్త్రీలలో వెజైనిస్మన్ వలన అంగప్రవేశం జరగదు. 
అది తమలోపంగా బావించి దిగులు లోనయినందువలన అంగస్తంభన సమస్య కలుగుతుంది. ఇలా
 అనేక కారణాలుగా ఈ సమస్య కలుగుతుంది. చికిత్సలో ఓర్పు అత్యంత అవసరం. 
యువకులలో ఇంపొటెన్సీ (అంగస్తంభన సమస్య) ఇన్ పీర్టిలిటీ (వీర్యకణాల సమస్య) ఈ
 రెండూ ఎక్కవవుతున్నాయి. వీర్యకణాల గూర్చి ప్రత్యేకం పురుషులలో సంతానలేమి- 
కారణాలు – చికిత్స అన్న పుస్తాకాలు వున్నయి.
కేవలం అంగస్తంభన సమస్యే కాకుండా ప్రీక్వెన్సీ కూడా యువకులలో బాగా 
తగ్గిపోతోంది.
నెలలో 1, 2 సార్లు ఏడాదిలో 1,2 సార్లు మాత్రమే సెక్స్ లో పాల్గొంటున్నాం 
అంటూ వచ్చేవాళ్ల సంఖ్య ఇప్పడూ భాగా ఎక్కువ అవుతోంది. తమలో సమస్య 
ఉన్నప్పటికీ తమకే సమస్య లేదని బార్యని బుకాయించడం, రాత్రి ఇంటికి వచ్చాక 
గొడవ పడడం, టీవీతోనో, కంప్యూటర్ తోనో గడపడం లాంటివి చాలామంది చేస్తున్నారు.
 సెక్స్ సమస్యతోపాటు ఆప్యాయత కూడా కరువయితే స్త్రీలకు భర్తంటేనే ఇష్టం 
పోతుంది. ఈ పరిస్థితి అనేక సంవత్సరాలు కొనసాగితే కుటుంబంలో కలహాలకు 
దారితీస్తుంది. రెండు సంసారాలని బాధించే సెక్స్ సమస్యల విషయంలో ఆడ, మగ 
ఇద్దరు జాగ్రత్త వహించి సకాలంలో చికిత్స తీసుకుంటే మంచిది.              
   
 
No comments:
Post a Comment