సెక్సు
హార్మోనుల ఉత్పత్తి అస్సలు లేకపోవటం మగవారిలో నపుంసకత్వానికి
దారితీస్తుంది. ఫలితంగా పురుషాంగం, వృషణాలలో పెరుగుదల లోపించి చిన్న
పిల్లల్లో మాదిరిగా కనిపిస్తాయి. ఉపలైంగిక లక్షణాలైన గడ్డాలు, మీసాలు,
ఫ్యూబిక్ హెయిర్ తయారుకావు. జన్యుపరమైన లోపాలు (వారసత్వంగా సంక్రమించే
దోషాలు), పుట్టుకతోనే వృషణాలలో ఏర్పడిన సమస్యలు, వృషణాలలో క్షయ రోగం
వ్యాపించటం,గడ్డలు పెరగటం, గనేరియా,సిఫిలిస్ వంటి సుఖరోగాల ప్రభావం వలన
వృషణాలు చైతన్య రహితంగా తయారు కావటం మొదలైన కారణాల మూలంగా సెక్సు హార్మోనుల
ఉత్పత్తిని నిరోధింపబడి నపుంసకత్వం ప్రాప్తిస్తుంది.
కొంతమందిలో అరుదుగా చిన్న వయసులోనే ఈ సెక్సు హార్మోనులు(ముఖ్యంగా టెస్టాస్టిరోన్) అదుపుతప్పి అధికంగా ఉత్పత్తి కావటం జరుగుతుంది. అందువలన విచిత్రమైన పరిస్థితి వారిలో దాపురిస్తుంది. పురుషాంగం భారీగా తయారుకావటం, విపరీతమైన సెక్సు కోరికలు కలిగిఉండటం, పెద్దవారిలా ప్రవర్తించటం మొదలైన లక్షణాలు ఏర్పడతాయి. వీరిలో హార్మోనుల చికిత్స చేయించటం ద్వారా పరిస్థితిని సరిదిద్దవచ్చు!
మానసిక కారణాల వలన కూడా కొంతమంది నపుంసకులుగా తయారవుతారు.అతిగా హస్త్తప్రయోగం చేసుకోవటం వలన, రతి సామర్ధ్యం పోతుందని, అందువలన స్త్రీతో సంభోగానికి పనికిరాననే ఆధారం లేని భయాలు,అపోహలు కలిగిఉండటం,తన జననాంగం చిన్నదిగా ఉన్నదని రతి సామర్ధ్యంపై నమ్మకం కోల్పోవటం, ఇతర సెక్సు పరమైన అంశాల పట్ల అవగాహనా రాహిత్యం మొదలైన కారణాల వలన శారీరకమైన లోపాలేవీ లేకపోయినప్పటికీ నపుంసకులుగా మారతారు.
ఇటువంటి వారిలో కొంతమంది హస్తప్రయోగం చక్కగా చేసుకొంటారు, స్త్రీతో సంభోగం విషయంలో మాత్రం ఫెయిలవుతారు. తమది మానసిక లోపమే గాని, శారీరక సమస్య కాదని గ్రహించలేక బాధపడు తుంటారు. ఇటువంటి మానసిక సమస్యలకు సెక్సాలజిస్టుతో జరిపే కౌన్సిలింగ్ వలన సులభంగా పరిష్కారం దొరుకుతుంది.
ఆడ సెక్సు హార్మోనులు
ఆడ సెక్సు హార్మోనుల్లో ప్రధానమైనది
ఈస్ట్రోజెన్. ఇది అండాశయాలలో తయారవుతుంది. స్త్రీ రజస్వల అయ్యే వయసులో ఈ
హార్మోన్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. పిట్యూటరీ గ్రంధిలో తయారయ్యే
గొనాడోట్రోఫిన్ రసాయనం అండాశయాలలోని ఈ హార్మోను ఉత్పత్తిని
ప్రేరేపిస్తుంది. ఈ హార్మోను ప్రభావం వలన స్త్రీకి మర్మాంగం,చంకల్లో
వెంట్రుకలు పెరగటం,మర్మాంగం దాని ఇతర భాగాలలో వికాసం, వక్షోజాలు వృద్ధి
చెందడం మొదలైన శారీరక మార్పులు కలుగుతాయి. కామపరమైన ఊహలూ, వాంఛలూ
పెరుగుతాయి.
ఈ హార్మోనుల ఉత్పత్తి జరగకపోతే ఆడపిల్ల రజస్వల కాలేదు. యోని,వక్షోజాలు వికాసం చెందకుండా చిన్నవిగానే ఉండిపోతాయి. ఆమెలో సెక్సు కోరికలు కూడా ఉండవు. మగవారి మూత్రపిండాలలో ఆడ సెక్సు హార్మోన్‌లు తయారైనట్టుగా, ఆడువారిలోనూ మగసెక్సు హార్మోన్‌ల(వీటిలో ప్రధానమైనది టెస్టాస్టిరోన్) ఉత్పత్తి జరుగుతుంది. ఇవి మూత్రపిండాలపై ఉండే ఎడ్రినల్ కార్టెక్స్‌లో తయారవుతాయి. ఏదేనీ కారణంగా ఎడ్రినల్ కార్టెక్స్‌లో ఈ హార్మోనులు అధికంగా విడుదలైతే మాత్రం వారిలో పురుష లక్షణాలు మొగ్గ తొడుగుతాయి.కండలతో కూడిన శరీరము,గంభీరమైన స్వరం, ఒంటినిండా వెంట్రుకలతో మగరాయుడిలా కనిపిస్తారు.
ఈ హార్మోనుల ఉత్పత్తి జరగకపోతే ఆడపిల్ల రజస్వల కాలేదు. యోని,వక్షోజాలు వికాసం చెందకుండా చిన్నవిగానే ఉండిపోతాయి. ఆమెలో సెక్సు కోరికలు కూడా ఉండవు. మగవారి మూత్రపిండాలలో ఆడ సెక్సు హార్మోన్‌లు తయారైనట్టుగా, ఆడువారిలోనూ మగసెక్సు హార్మోన్‌ల(వీటిలో ప్రధానమైనది టెస్టాస్టిరోన్) ఉత్పత్తి జరుగుతుంది. ఇవి మూత్రపిండాలపై ఉండే ఎడ్రినల్ కార్టెక్స్‌లో తయారవుతాయి. ఏదేనీ కారణంగా ఎడ్రినల్ కార్టెక్స్‌లో ఈ హార్మోనులు అధికంగా విడుదలైతే మాత్రం వారిలో పురుష లక్షణాలు మొగ్గ తొడుగుతాయి.కండలతో కూడిన శరీరము,గంభీరమైన స్వరం, ఒంటినిండా వెంట్రుకలతో మగరాయుడిలా కనిపిస్తారు.
ఉద్రేకపరచే కామరసాయనాలు
జంతుజాలంలో ఆడ,మగ మధ్య పరస్పర లైంగికావేశం,
లైంగికోద్రేకం కలిగినపుడే వాటి నడుమ సంభోగం ఏర్పడుతుంది. ఫలితంగా సంతానం
కలిగి తమ జాతి వృద్ధి చెందుతుంది. మానవులలో మాదిరి అందచందాల ఆకర్షణ
జంతువులలో ఉండదు. అటువంటప్పుడు వాటిమధ్య లైంగికబంధం కలిగేందుకు ఏదేనీ
హేతువు ఉండాలికదా! అందుకోసం ప్రకృతి చేసిన ఏర్పాటే కామరసాయనాలు!! జీవరాశు
లన్నింటిలోనూ ఉత్పత్తయ్యే ఈ రసాయనాలను ఫిరమోన్ లంటారు.
ఫిరమోన్‌లనగా తేలికగా ఆవిరైపోతూ, రసాయనిక సంకేతాలను వ్యాపింపజేసేవని అర్ధం! ఆడ జంతువులు ఎదకొచ్చినపుడు వాటి మర్మావయవాలలో ఈ ఫిరమోన్‌లు ఉత్పత్తవుతాయి. ఈ రసాయనాల వాసనకు మగ జంతువులు ఆకర్షింపబడి,లైంగికావేశానికి లోనవుతాయి. ఫలితంగా వాటిమధ్య సంభోగం కుదురుతుంది. చిత్తకార్తెలో కుక్కల సంభోగ దృశ్యాలు ప్రతి యేడాదీ మనకు కనిపించేదే! ఆడకుక్క వెనుక మగకుక్క తిరగటం,........ యోని వద్ద తరచూ వాసన చూస్తూ, లైంగికోద్రేకెం చెందటం జరుగుతుంది. ఈ కామరసాయనాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వీటికి విరుద్దమైన (లైంగిక వికర్షణ) ప్రభావాన్ని కలిగించే కృత్రిమ రసాయనాలనూ తయారు చేయగలిగారు. వీటిని ఉపయోగించి ఆడ కుక్కల జోలికి మగ కుక్కలు రాకుండా చేయగలుగుతున్నారు.
ఫిరమోన్‌లనగా తేలికగా ఆవిరైపోతూ, రసాయనిక సంకేతాలను వ్యాపింపజేసేవని అర్ధం! ఆడ జంతువులు ఎదకొచ్చినపుడు వాటి మర్మావయవాలలో ఈ ఫిరమోన్‌లు ఉత్పత్తవుతాయి. ఈ రసాయనాల వాసనకు మగ జంతువులు ఆకర్షింపబడి,లైంగికావేశానికి లోనవుతాయి. ఫలితంగా వాటిమధ్య సంభోగం కుదురుతుంది. చిత్తకార్తెలో కుక్కల సంభోగ దృశ్యాలు ప్రతి యేడాదీ మనకు కనిపించేదే! ఆడకుక్క వెనుక మగకుక్క తిరగటం,........ యోని వద్ద తరచూ వాసన చూస్తూ, లైంగికోద్రేకెం చెందటం జరుగుతుంది. ఈ కామరసాయనాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వీటికి విరుద్దమైన (లైంగిక వికర్షణ) ప్రభావాన్ని కలిగించే కృత్రిమ రసాయనాలనూ తయారు చేయగలిగారు. వీటిని ఉపయోగించి ఆడ కుక్కల జోలికి మగ కుక్కలు రాకుండా చేయగలుగుతున్నారు.
కొన్ని జంతువులలో మగవి ఫిరమోన్స్‌ని విడుదల జేస్తూ, ఆడువాటిని ఆకర్శిస్తాయి. వేడెక్కిఉన్న ఆడ జంతువుతో శృంగారం జరిపే ముందు మగది అధికంగా లాలాజలంను వదులుతుంది.ఆ లాలాజలంలోని ఫిరమోన్స్ వాసన ప్రభావం వలన ఆడ జంతువు మత్తెక్కిపోయి, కదలకుండా ఉండిపోతుంది.దాంతో మగ జంతువు శృంగారానికి మార్గం సుగమమవుతుంది.
ఆడ జంతువులో విడుదల అయిన అండం ఫలదీకరణం చెందడంలోనూ ఫినరమోన్‌లు తగిన ప్రభావాన్ని కలిగిఉంటాయి.అండం విడుదలయ్యే సమయంలో ఈ ఫిరమోన్‌ల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. కీటకాలలో ఫిరమోన్‌ల ప్రభావం మరింత నిశితంగా ఉంటుంది. ఉదాహరణకు... ఆడ పట్టుపురుగును కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న మగ పట్టు పురుగు వాసన ద్వారా పసిగడుతుంది.
బుద్దిజీవులైన మానవులలో మాత్రం ఈ కామరసాయనాల అవసరం కనబడదు. వీరిలో లైంగికాకర్షణ ప్రధానంగా కంటిచూపులు, శారీరక స్పర్శ వలన కలుగుతుంది. జంతుజాలంలో సెక్సు కేవలం సంతాన సాధన కోసమే కాగా, మానవులు ఋతువులతో సంబంధం లేకుండా ఏ కాలంలో నైనా, సంతానోత్పత్తితో బాటు అనిర్వచనీయమైన సంభోగసౌఖ్యాన్నీ అనుభవించగలరు!
పరిణామ క్రమంలో సర్వోన్నత స్థాయిని సాధించినప్పటికీ ఈ బుద్దిజీవులలో జంతుదశ కాలంనాటి పాత వాసనలింకా పోలేదనేందుకు వీరిలో ఉత్పత్తయ్యే ఫిరమోన్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి! వీటి అవసరం లేనప్పటికీ, స్త్రీలలో అండం విడుదల అయ్యే సమయంలో ఇవి తయారై, తరువాత తగ్గిపోతున్నట్టుగా పరిశోధకులు గమనించారు.
రతి కార్యక్రమంలో భాగంగా కొంతమంది తీవ్ర ఉద్రేకంతో స్త్రీ జననేంద్రియాన్ని నాలుకతో నాకుతుంటారు. గాఢమైన మోహావేశానికి లోనైన సందర్భంలో కొందరు స్త్రీలు కూడా పురుషుని జననాంగమును నోట్లో పెట్టుకొని గీరుతుంటారు. 'కన్నిలిగ్నస్' గా పిలిచే ఈ రకమైన లైంగికచర్యకు ప్రేరణ ఫిరమోన్‌ల ఆకర్షణే అని తెలుస్తోంది. కొంతమంది పురుషులకు స్త్రీ యోని వాసన చూస్తేగానీ ఉద్రేకం కలుగదు. అప్పుడు మాత్రమే వారికి అంగస్తంభనం కలిగి సంభోగం చేయగలుగుతారు.స్త్రీ యోని గంధం వాసన తమకు ఉత్తేజాన్ని కలిగిస్తుందని 40 శాతం మంది మగవారు ఒక సర్వేలో వెల్లడించారు. యోని ఛుంభనం వారికి గాఢమైన లైంగికానందాన్ని కలిగిస్తుందని తెలిపారు.
అమెరికాలోని హార్వర్ద్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని ఆశక్తికరమైన అంశాలు వెలుగుచూసాయి. హాస్టల్స్‌లో కలిసిఉండే మహిళల్లో కొంతకాలం తర్వాత ఋతుస్రావాలు సుమారుగా ఒకే సమయంలో ప్రారంభమౌతున్నట్టుగా కనుగొన్నారు. ఒకరి నెలసరి గురించి మరొకరికి తెలియకుండానే ఈ విశేషం చోటుచేసు కొంటోంది. ఎక్కువ కాలం కలిసి ఉండే మహిళల్లోనే ఇలా జరుగుతోంది. అలాగే మగవారితో చెట్టాపట్టాలేసుకు తిరిగే(మరీ అడ్వాన్సు కాకుండా) యువతుల్లోనూ ఋతుస్రావాలు కాస్త ముందుగా కలుగుతున్నాయి. వీరిలోఉత్పత్తయ్యే ఫిరమోన్‌ల ప్రభావమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఒకే ఇంటిలో నివసించే అక్కాచెల్లెల్లు,తల్లీ కూతుళ్ళ బహిష్టు దినాలు కూడా దాదాపు దగ్గరగానే ఉంటున్నాయి.
ఫిరమోన్స్ ప్రభావంపై పరిశోధనలు జరుపుతున్న వైద్యులు ఎంపికచేసిన కొందరు స్త్రీలను ఎ,బి అనే రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో ఎ గ్రూపు వారికి నెలసరి సక్రమంగా ఉండే ఆడువారి యొక్క చెమటను ఆల్కహాలుతోకలిపి వాసన చూపించేవారు. బిగ్రూపువారికి మాత్రం కేవలం ఆల్కహాలును మాత్రమే వాసన చూపించేవారు.4 నెలలు గడిచిన తరువాత ఎ గ్రూపు వారి బహిష్టు తేదీలలో మార్పు కనిపించింది. తమకు ఎవరి చెమటను వాసన చూపించారో వారి బహిష్టు తేదీకి దగ్గరలో (రెండు-మూడు రోజుల తేడాలో) వీరికి బహిష్టులవటం మొదలైంది.కేవలం ఆల్కహాలు మాత్రమే వాసన చూపించబడిన వారిలో మాత్రం ఏవిధమైన మార్పూ కనిపించలేదు.
ఈ పరిశోధనా ఫలితం ఆధారంగా......ఆరోగ్యవంతమైన స్త్రీ శరీరం నుండి సేకరించిన ఫిరమోన్స్‌ను బహిష్టులు సక్రమంగా అవని(30 నుండి40 రోజులకు పైగా నెలసరి కానివారు)ఆడువారిపై ప్రయోగించారు. వారి పై పెదవిపై ప్రతిరోజూ ఫిరమోన్స్‌ను పూయటం చేయసాగారు. 3-4 నెలల తరువాత వారి సమస్య తొలగిపోయి 28 రోజులకే వారు బహిష్టులు కావటం గమనించారు.
ఫిరమోన్‌ల ఉత్పత్తి మగవారిలోనూ ఉంటుందని ఇటీవల జరిగిన పరిశోధనలో నిర్ధారించబడింది. పురుషుల బాహు మూలలలోని చెమటలో అంతర్గతంగా ఉండే ఆ రసాయనాల వాసన స్త్రీలను ఎంతగానో ఆకర్షిస్తుందని ఫిలడెల్పియాలోని మోనెల్ కెమికల్ సెన్సస్ సెంటర్ పరిశోధకులు గుర్తించారు. (కస్తూరి వంటి కొన్ని జంతువులలో కూడా మగవి కామరసాయనాల(కస్తూరి)ను ఉత్పత్తి చేసి, ఆడవాటిని ఆకర్షించడం ఉంది) చెమట పరిమళాన్ని బట్టి మహిళలకు ఆయా పురుషులపై యిష్టత ఏర్పడుతుందని ఈ పరిశోధనలో తేలింది. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసిన మహిళలు ఈ విషయాన్ని అంగీకరించారు.
మగవారి చెమటలోని ఫిరమోన్స్ స్త్రీలలో ల్యూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అయితే ఇక్కడొక విషయంగుర్తుంచుకోవాలి. ..... వ్యక్తిగత పరిశుభ్రత లేనప్పుడు మాత్రం ఈ సువాసనే చెమటకంపుగా మారి, స్త్రీలకు ఆ మగవానిపై ఒళ్ళు మండేలా చేస్తుందని కూడా అదే అధ్యనంలో బయటపడింది.( ఫిరమోన్‌ల వాసనను పోలిన సెంట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి).
కామరసాయనాల వాసనలు పసిగట్టే విషయంలో ఆడవారు మగవారి కంటే ముందుంటారు. వారి శరీరంలో తయారయ్యే ఈస్ట్రోజెన్ వారిలోని ఈ వాసనలను విశ్లేషించే నిపుణతకు కారణంగా కనుగొన్నారు. ఈస్ట్రోజెన్‌ను ఇంజెక్షన్ ద్వారా పురుషులకు ఇచ్చినపుడు వారు కూడా కామరసాయనాలను తేలికగా గుర్తించటం జరిగింది.
ఎండార్ఫిన్స్
సంభోగ సమయంలో మెదడులో ఒక రకమైన రసాయనములు
ఉత్పత్తవుతాయి.నల్లమందు వలే ఉత్తేజకరమైన మత్తును కలిగించే ఈ రసాయనములను
ఎండార్ఫిన్స్ అంటారు. భావప్రాప్తి దశలో వీటి ఉత్పత్తి జరుగుతుంది. 1.నిద్ర
కలిగించడం, 2. నొప్పులను తగ్గించడం ఇవి నిర్వహించే పనులు.సంభోగం తదనంతరం
హాయిగానిద్రపోవాలనిపించడం ఎండార్ఫిన్స్ మహత్యమే!
అలాగే కీళ్ళనొప్పుల సమస్యతో బధపడేవారు తరచూ రతిలో పాల్గొంటుంటే ఆ నెప్పుల నుండి ఉపశమనం కలుగుతు న్నట్టుగా వెల్లడైంది.ఈ విషయంలోనూ ఎండార్పిన్సే సహకరిస్తున్నాయని పరిశోధకులంటున్నారు. సంభోగ సమయంలోనే కాకుండా, ప్రశాంత చిత్తంతో ధ్యానం కొనసాగినప్పుడూ మెదడులో ఎండార్ఫిన్స్ విడుదల జరుగుతోందని నిర్ధారణ జరిగింది.
No comments:
Post a Comment