Welcome To సుఖ-సంసారం

Thursday 6 November 2014

కోర్కె తగ్గడానికి కారణమేమిటి?

కోర్కె తగ్గడానికి కారణమేమిటి?
మేడమ్! నా వయస్సు 22 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితం నా వృషణాలకు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి నా ఎడమ వృషణం చిన్నదై, తీవ్ర నొప్పి వస్తోంది. ఇప్పుడు కుడి వృషణం కూడా కిందికి గుంజుతున్నట్లు అనిపించి, నొప్పి బాగా వస్తోంది. మునుపటిలాగా అంగస్తంభనలు, సెక్స్ కోరికలు కలగడం లేదు. ఒకవేళ అంగస్తంభన కలిగినా క్షణాలలో తగ్గిపోతుంది. వీర్యం కూడా చాలా తక్కువ పరిమాణంలో వస్తోంది. నాకు తీవ్రమైన గ్యాస్ ట్రబుల్ ఉంది. దానివల్ల అంగస్తంభన సమస్య వస్తుందా? లేక ఆ గ్యాస్ మూత్రపిండాలలో నుంచి వృషణాలలోకి వెళ్ళిందేమో అనిపిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. నపుంసకత్వం వచ్చిందేమోనని అనుమానం. యూరాలజిస్ట్‌ని కలిస్తే వృషణాలను పట్టుకొని ‘ఏమీ కాలేదని’ చెప్పారు. ఇంతకూ, నాకు వచ్చిన సమస్య ఏంటి? దీనివల్ల నేను రెండేళ్లుగా మానసిక వేదన అనుభవిస్తున్నాను. నేను వివాహానికి పనికి వస్తానా? అన్ని అవయవాలు మంచిగా ఉండి కూడా కొందరు సెక్స్‌లో ఫెయిల్ అవుతుంటారు. మరి, నా పరిస్థితి ఏంటి? నా కంటే చిన్న వయసు వారి అంగం, వృషణాలు పెద్దవిగా ఉన్నాయి. నావి చిన్నగా ఉన్నాయి. దీనివల్ల బహిరంగ మలవిసర్జనకు వెళ్ళలేకపోతున్నా. దయచేసి నా సమస్యకు పరిష్కార మార్గం చూపించండి.-వి.జే.కె., (ఊరు పేరు రాయలేదు)
kreddy9890@gmail.com
మీ సమస్య వరిబీజం అయి ఉండవచ్చు. మీరు చెప్తున్న లక్షణాలు దానికి సంబంధించినవే. మీరు స్క్రోటల్ కలర్ డాప్లర్ చేయించుకోవాలి. వెరికోసీల్ గ్రేడ్ ఫోర్-ఫైవ్ వరకు ఈ సమస్య రాదు. అలాగే, మీకు వచ్చిన అంగస్తంభన సమస్య మానసిక కారణాల వల్ల వచ్చి ఉండవచ్చు. మీకున్న గ్యాస్ ట్రబుల్‌కి, అంగస్తంభన సమస్యకి, వృషణాల్లో నొప్పికి ఎలాంటి సంబంధం లేదు. గ్యాస్ వృషణాల్లోకి వెళ్ళే ఆస్కారమే లేదు. తిరిగి పెద్ద పేగుల్లోకే వెళ్ళిపోతుంది. ‘నపుంసకత్వం’ అన్న పదం మంచిది కాదు. ‘అంగస్తంభన సమస్య’ అనాలి. భయాందోళన వల్ల కూడా ఈ అంగస్తంభన లోపం ఏర్పడి ఉండవచ్చు. అపోహలతో నెగెటివ్ థింకింగ్‌తో ఉన్నారు. ఆత్మహత్య పరిష్కారం కాదు. మీది ఫిజికోజెనిక్ ఎరైటల్ డిస్‌ఫంక్షన్. అంటే వ్యతిరేక మానసిక కారణాల వల్ల వచ్చిన అంగస్తంభన సమస్య మాత్రమే. అంటే మానసికమైంది. అంగస్తంభన సమస్యకు శారీరక కారణాలు లేకపోతే మానసిక కారణాలే 90 శాతం పనిచేస్తాయి. కాబట్టి, నువు మంచి సెక్సాలజిస్ట్‌ని సంప్రదించు. నీకు ఆందోళన, నెగెటివ్ ఆలోచనా దృక్పథాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని, పాజిటివ్ ఆలోచనా ధోరణిని పెంచే దిశగా మానసిక చికిత్సతోపాటు సెక్స్ థెరపీ కూడా ఇచ్చి అంగస్తంభన సమస్యను పరిష్కరిస్తారు. ఇక, వేరే వాళ్ళతో నీ వృషణాల సైజుని పోల్చుకోవద్దు. సైజు ముఖ్యం కాదు. కోరిక బాగా ఉండటం ముఖ్యం. నెగెటివ్ ఆలోచనలతో, నమ్మకాలతో నీ సమస్యను ముదర గొట్టుకోకుండా సెక్సాలజిస్ట్‌ను కలువు.

మేడమ్! నా వయస్సు 35 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. గత రెండేళ్లుగా అంగస్తంభన సమస్యతో బాధ పడుతున్నాను. నా భార్యను సెక్స్‌లో సంతృప్తి పరచలేకపోతున్నాను. అంగం కురచగా, సన్నగా, వంకరగా ఉంది. ఒకసారి డాక్టర్‌ని సంప్రదిస్తే ‘పైరోనీస్’ అనే వ్యాధి ఉందని, దానికి మందులు ఉండవని చెప్పారు. అయితే, దీనికి నివారణ ఉంటుందని ‘బతుకమ్మ’లో చదివాను. నా సమస్యకు తగిన పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాను.- కె.ఆర్., ఏటూర్ నాగారం

మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని యూరో-ఆంవూడాలజిస్ట్‌ను సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. అలాగే, కౌన్సెలింగ్ కోసం ఒకసారి మీ భార్యతో సహా సెక్సాలజిస్ట్‌ని కలవండి.

మేడమ్! నేను డిగ్రీ చదివేటప్పుడు పాత కండోమ్‌ను అంగానికి పెట్టుకున్నాను. అది ఇన్‌ఫెక్షనై నొప్పి అనిపించింది. అయితే, నాకు పెళ్లయి 3 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ పిల్లలు లేరు. సైమన్ ఎనాలసిస్ చేయిస్తే ‘O’గా వస్తుంది. డాక్టర్‌కి చూపిస్తే ‘టెస్టిక్యూలర్ బయాప్సీ’ చెయ్యాలన్నారు. రెండు వృషణాలకు బయాప్సీ చేస్తే సెక్స్ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.- ఆర్.ఎస్., ఖమ్మం

మీకు వీర్యకణాలు ‘o’ స్థాయిలో అంటే అసలు లేని స్థితిలో ఉన్నాయి. మీ డాక్టర్లు మీకు చేసే ‘టెస్టిక్యూలర్ బయాప్సీ’ అంటే వృషణాల ముక్క పరీక్షలో వీర్యకణాలు ఎందుకు లేవో తెలీడంతోపాటు ఒకవేళ కొన్ని వీర్యకణాలు ఉంటే వాటితో సంతానం కోసం మీ భార్యకు కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏ సమస్యా రాదు. చేయించుకోండి. సెక్స్ పరమైన సమస్యలు ఏవీ రావు.

naa email id: kreddy9890@gmail.com

No comments:

Post a Comment