Welcome To సుఖ-సంసారం

Thursday 6 November 2014

తగ్గిపోయిన వక్షస్థలం పెరిగేదెలా?

for suggestions  e-mail me my e-mail id: kreddy9890@gmail.com

మేడమ్! మా పాప పుట్టాక ఏడాదికి పాలు మాన్పించడానికి నాకేదో ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటి నుండి నా ఛాతీ మరీ చిన్నదిగా అయిపోయింది. దాంతో నా భర్త అసంతప్తి చెందుతున్నాడు. వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎవరితో ఈ బాధ చెప్పుకోలేదు. నా ఛాతీ పెరగడానికి ఏదైనా మార్గం చెప్పండి?- ఆర్.ఎన్., కాకినాడ (ఈ-టప్ప)

ఎవరితోనూ ఈ బాధ ఎందుకు చెప్పుకోలేదు? చెప్పుకోవాలి. పంచుకోవాలి. అప్పుడే మీ భర్త మీతో చేస్తున్న అన్యాయం తెలిసేది. మీకేం చెయ్యాలో అర్థం అయ్యేది. ముందు మీ భర్త చేస్తున్న పనిని మీ తల్లిదండ్రులకు, అతని తల్లిదండ్రులకు చెప్పేయండి. అలాగే, మీ భర్తకు యూడీఆర్‌ఎల్, హెచ్‌ఐవి, హెచ్‌ఎస్‌వి 1, 2 పరీక్షలు చేయించండి. మీరూ చేయించుకోండి. అతనితో సెక్స్‌లో పాల్గొనడం వెంటనే ఆపెయ్యండి. మీకు పాప పుట్టడానికి అతనూ బాధ్యుడు. ఆ బిడ్డకి తండ్రి కుటుంబం ఏర్పడ్డం కోసం మాత్రమే పిల్లల్ని కన్నారు. మీ కోసం మాత్రమే కాదు కదా. అదొక సమిష్టి నిర్ణయం. పాప పుట్టుక కారణంగా మీకొచ్చిన ఈ సమస్యకు మీరొక్కరే బాధ్యులు కాదు. అతను కూడా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. మీకు తోడుగా ఉండాల్సింది పోయి సిగ్గు లేకుండా మీ ముందు అసంతప్తి వ్యక్తం చేస్తూ అక్రమ సంబంధాల్లోకి వెళ్ళి మీకు అభద్రతనూ, అవమానాన్ని, అనారోగ్యాన్నీ ఇస్తున్నాడు. అటువంటి అతన్ని మీరు ప్రశ్నించి, శిక్షించాల్సింది పోయి అతని కోసం ఛాతి పెంచుకొనే మార్గాల్ని వెతుక్కోవడం ఆత్మగౌవరం అనిపించుకోదు. అతడు మీ పట్ల చేస్తున్న నేరాన్ని, దాని తీవ్రతను మీరే తగ్గించేస్తున్నారు. వెంటనే మీరు పరీక్షలు చేయించుకొని ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులతో చర్చించండి. పాలు, నెయ్యి లాంటి మంచి పౌష్టికాహారం తీసుకుంటే మళ్ళీ మీ ఛాతీ పెరుగుతుంది.


డాక్టర్! నాకు పెళ్ళయి 8 నెలలు అవుతోంది. నాకు శీఘ్రస్ఖలన సమస్య ఉంది. యోని బయటే స్ఖలిస్తాను. పిల్లలు పుడతారా? అంగప్రవేశం చాలా తక్కువసార్లు అవుతోంది. దీనివల్ల నా భార్య చాలా చిరాకు పడుతోంది. పిల్లలు పుట్టరేమోనని భయపడుతోంది. పరిష్కారం చెప్పగలరు.- వి.జె.సీ., బెంగుళూరు (ఈ-టప్ప)

శీఘ్రస్ఖలనానికి, పిల్లలు పుట్టక పోవడానికి సంబంధం లేదు. స్ఖలనం అంగప్రవేశం అయిన మరుక్షణమే అయినా వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించి అండం సిద్ధంగా ఉంటే పిల్లలు పుడతారు. అలాగే, వీర్యస్ఖలనం యోని బయట యోనిద్వారం మీద అయినా వీర్యకణాలు యోని నాళం గుండా ప్రవేశించి గర్భాశయంలోని అండాన్ని చేరతాయి. మీ సమస్య పిల్లలు పుట్టక పోవడం కాదు. శీఘ్రస్ఖలనం చాలా తీవ్రంగా అంటే అంగప్రవేశమే చేయలేనంత వేగంగా స్ఖలనం అయిపోవడం. దీనివల్ల దంపతులిద్దరూ సంతప్తిని పొందలేరు. శీఘ్రస్ఖలన సమస్యవల్ల శంగారంలో భాగస్వామి అసంతప్తికి లోనవడం సహజం. దీనివల్ల ఆందోళన మరింత పెరిగి, ఒత్తిడికి గురై, మరోసారి శీఘ్రస్ఖలనం అవుతుంటుంది. శీఘ్రస్ఖలనం తగ్గించుకోకపోతే మెల్లగా ఆసక్తి తగ్గిపోయి, డిప్రెషన్ పెరిగి అంగస్తంభన సమస్య వస్తుంది. దంపతుల మధ్య గొడవలు వస్తాయి. దూరాలు పెరుగుతాయి. శీఘ్రస్ఖలన సమస్య ప్రోస్టేట్ గ్రంథి వ్యాధుల్లో, దీర్ఘకాలిక మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లో సెక్స్ కండరాలు బలహీనమవడంతో వస్తుంది. ఈ సమస్యలు ఉంటే పరిష్కరించుకోండి. అలాగే, సెక్స్ చేసే ప్రతీసారి ఫర్‌ఫార్మెన్స్ ఆంైగ్జెటీకి లోనైనా ఈ సమస్య వస్తుంది. మీరు మంచి సెక్సాలజిస్టును కలవండి. అంగస్తంభన కాలాన్ని పెంచి శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఈవిటి-ఐయూటి, కౌన్సెలింగ్ థెరపీలతో మీ సమస్య పరిష్కారం అవుతుంది.

మేడం! నాకు ఆరు సంవత్సరాల నుండి హస్తప్రయోగం అలవాటుంది. నా సమస్య ఏమిటంటే నాకు అంగం స్తంభించినప్పుడు ఎడమ వైపుకి లాగుతూ ఒంకరగా, అరటిపండులా సన్నగా ఉంటుంది. బీర్జాలు కూడా చిన్నవిగా ఉంటాయి. ఏదో పత్రికలో చదివా! అంగంలో కొవ్వు నింపడం ద్వారా సైజు పెంచుకోవచ్చు అని. ఇది నిజమేనా? ఒకసారి నేను ఒక ఆండ్రాలజిస్ట్‌ను కలిస్తే అతను నన్ను పరీక్ష చేసి ఎలాంటి టెస్ట్‌లు చేయకుండానే అంగం ఒత్తి చూసి ఇంకోసారి హస్తప్రయోగం చేస్తే హిజ్రా అవుతావు అన్నారు. నేను ఈ విషయంలో ముగ్గురు డాక్టర్లను కలిశాను. వారంతా ఏవేవో మందులు రాసేవారు. పదుల సంఖ్యలో పరీక్షలు చేయించి కుప్పల కొద్దీ మందులు రాసేవారు. కానీ, నా సమస్య తీరలేదు. సరైన చికిత్సను అందించే ఏదైనా క్లినిక్ అడ్రస్ తెలుపగలరు. ఆర్.ఎస్., వరంగల్

ఏ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్టు కూడా పేషెంట్ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీసే విధంగా హస్తప్రయోగం చేస్తే హిజ్రా అవుతారని అనరు. నువ్వు ఖచ్చితంగా అన్ క్వాలిఫైడ్‌కి చూపించుకుని ఉంటావు. సిటీకి వచ్చి మంచి డాక్టరుతో పరీక్ష చేయించుకొని కౌన్సెలింగ్ తీసుకో. నీకున్నవన్నీ అపోహలే. స్తంభించిన అంగం ఏదో ఒకవైపుకు వాలుతుంది. ఎటువైపుకి ఉన్నా అంగప్రవేశానికి అడ్డం రాదు. కాబట్టి, సమస్యే లేదు. అంగాన్ని తిన్నగా చేసే సర్జరీలు అవసరం లేదు. అసలు అటువంటి సర్జరీలు లేవు. అలాగే, బీర్జాలు మరీ చిన్నగా ఉంటేనే ఆలోచించాలి. బీర్జాలు చిన్నగా ఉన్నా మంచి అంగస్తంభన, కోరిక, మంచి సంఖ్యలో వీర్యకణాలు ఉంటే బీర్జాల సైజు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంగంలో బీర్జాల్లో కత్రిమంగా కొవ్వు నింపుకోవాల్సిన అవసరం లేదు. లావుగా కనబడ్డం కంటే వషణాల నుంచి కావల్సినంత సంఖ్యలో వీర్యకణాలు ఉత్పత్తి చేయగలిగితే చాలు. నీవొకసారి మంచి సెక్సాలజిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్ తీసుకో


for suggestions  e-mail me my e-mail id: kreddy9890@gmail.com

2 comments: