Welcome To సుఖ-సంసారం

Saturday, 31 May 2014

లైంగిక జీవితంలో అసంతృప్తికి కారణాలేంటి

కొంతమంది లైంగిక జీవితం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తమకు తగినంత లైంగికానందం కలగడం లేదని, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా స్పందించడం లేదని బాధపడి పోతుంటారు. వాస్తవానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. ఇతరేతర సమస్యలే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి రెండోవారు అది ఇప్పుడు ఇష్టం లేదు అని అంటున్నారంటే, దాని వెనుక మరేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.

పడక గదికి చేరిన తర్వాత మనసులో సెక్స్ కోరికలు తప్ప మరే కోరికలకు చోటివ్వరాదు. అలా ఉండటానికి స్త్రీపురుషులిద్దరూ ప్రయత్నించాలి. ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటిని అక్కడే వదిలివేయాలి. ఆ సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఎందుకంటే ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.

భాగస్వామిలో సెక్స్ అలజడులను రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే స్త్రీపురుషుల్లో స్పందన కలుగుతుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శించాలి. అలా నెమ్మదిగా వారిని సెక్స్‌కి సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి సెక్స్‌కు తీసుకెళ్లాలి. అంతేకాదు లైంగిక కబుర్లను చెప్పడం కూడా సెక్స్ కోర్కెల ద్వారాలను తెరవొచ్చు. సెక్స్ తృప్తి అనుభవించిన జంటల్లో మానసిక ఆందోళనలు కానరావు. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment