Welcome To సుఖ-సంసారం

Tuesday, 28 January 2014

రతిక్రీడ

రతిక్రీడ వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒత్తిడి నుంచి, నొప్పుల నుంచి రతిక్రీడ ఉపశమనం కలిగిస్తుందని అంటున్నాయి. గత రాత్రి రతిక్రీడలో పాల్గొన్న వ్యక్తి మర్నాడు ఒత్తిడిని చాలా సులభంగా అధిగమించాడని బయోలాజికల్ సైకాలజీ జర్నల్ తేల్చింది. సెక్స్ ఎండార్ఫిన్స్ను పెంచుతుందని, అది శరీరానికి సహజమైన నొప్పి నివారణ ఔషధంగా పనిచేస్తుందని, నిమిషాల్లో నొప్పులు మాయమవుతాయని ఎక్స్పరిమెంటల్ బయోలాజీ, మెడిసిన్ బులిటెన్ తెలియజేస్తోంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి స్పర్శతో ఉపశమనం పొందుతాడని లైంగిక మానసిక శాస్త్రవేత్త స్టార్ట్ బ్రాడీ అంటున్నారు. ఎవరైన స్పర్శిస్తే ఆనందదాయకమైన ఉపశమనం లభిస్తుందని, దానివల్ల ఒత్తిడికి సబంధించిన హార్మోన్ కోర్టిసాల్ మోతాదు తగ్గుతుందని అంటున్నారు.

No comments:

Post a Comment